కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరైనట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ అంశంపై తాజాగా వీహెచ్ స్పందించారు. "ఒకరిద్దరికి కోపం రావచ్చు. నిన్న మీటింగ్ లో సీఎం నీ.. ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు. జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అన్నారు. దాని మీద సీఎం తోనే మాట్లాడుతాం. సీఎం తో…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. "బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం జరిగింది. సమయానికి రైతుబంధు తో పాటు సబ్సిడీలు అందజేసి నూనె గింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సాహం కల్పించాం. సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. నాటి ప్రణాళికా బద్దంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్) పంట కోతకు వచ్చింది. సన్ ఫ్లవర్…
నీటి ఊట.. టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్కి తీవ్ర ఆటంకంగా మారింది. నీరు నిరంతరాయంగా వస్తోంది. నీరు ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ సర్వే టీమ్ అన్వేషిస్తోంది. టన్నెల్ పైభాగంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని తిర్మలాపూర్ సమీప ప్రాంతం లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్లు అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ టీమ్ సర్వే నిర్వహించాయి. మల్లెల తీర్థం నుంచి కృష్ణా నది వైపు ప్రవాహం సాగుతోంది. ప్రస్తుతం ప్రమాద స్థలం…
మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఎయిర్ పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 6 నుంచి నిర్వహించే పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం సమంజసం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. "ఈ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేస్తారు. అదే టైంకి పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తరువాత విధుల నుంచి ప్రభుత్వం…
ఎలాన్ మస్క్ 2002లో అమెరికా పౌరసత్వం పొందారు. చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. ఆయన తనను తాను హాఫ్-డెమొక్రాట్, హాఫ్ రిపబ్లికన్ అనీ, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకునేవారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్లకు ఓటు వేశానని, అంతేకాకుండా జో బైడెన్కు అయిష్టంగానే ఓటు వేశానని మస్క్ చెప్పారు. కానీ కొన్నేళ్లుగా ఆయన డోనల్డ్ ట్రంప్కు మద్దతిస్తూ వచ్చారు. ట్రంప్ ప్రచారానికి ప్రధాన మద్దతుదారులలో ఒకరిగా ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా. ఈ కంపెనీ భారత్లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ అతి త్వరలో ముగియబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన మొదటి షోరూమ్ కోసం స్థలాన్ని చూసింది. షోరూమ్ కోసం కంపెనీ దాదాపు 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
నేడు యూపీఐ చెల్లింపులు జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఆన్లైన్ షాపింగ్ కు మాత్రమే కాకుండా.. చిన్న చిన్న కిరాణా సామన్లు కొనుగోలు చేసేందుకు కూడా ఈ చెల్లింపు విధానాన్ని ఉపయోగిస్తున్నాం. భారతదేశాన్ని ‘న్యూ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’గా మార్చడానికి ఇది చాలా ముఖ్యమైన సాధనం. ఇప్పటికే జనాలు ఈ యూపీఐ చెల్లింపు విధానానికి అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానం మొదలు పెట్టింది.
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించిన విషయం విదితమే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాలనా బాధ్యతలు రాష్ట్ర పతి చేతుల్లోకి వచ్చాయి. నేడు అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.