టాలీవుడ్ సీనియర్ సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అసలు ఒక స్టార్ సింగర్ ఇలా సడెన్ గా ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ ఆశ్చర్య పోయారు. తాజాగా కేపీహెచ్బీ పోలీసులు కల్పనా స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేపీహెచ్బీ పీఎస్ కి చెందిన మహిళా ఎస్సైతో పాటు మరో ఎస్ఐ ఆస్పత్రికి వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. కల్పన సంచనల విషయాలు వెల్లడించింది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5న మొదలై.. 24తో ముగుస్తాయి. కాగా.. మార్చి 6 నుంచి మొదలయ్యే ద్వితీయ ఇంటర్ పరీక్షలు 25వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.…
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ…
అవసరమైతే రోబోలను పంపి.. రెస్క్యూ ఆపరేషన్ లో వాడుకునే దిశగా ప్రయత్నం చేయాలని సూచించామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పరీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈ విపత్తు లో పనిచేస్తున్నాయన్నారు. "ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి మంత్రులు జూపల్లి, ఉత్తమ్ లను ఇక్కడికి…
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. గంటకు పైగా వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. మరికొద్ది సేపట్లో సీఎం మీడియాతో మాట్లాడనున్నారు.
మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన మనకు అంతో ఇంతో చేయాలని ముందుకొస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి నే ఓర్వలేక పోతున్నారు. సైంధవుడిగా కిషన్ రెడ్డి ఉన్నాడు." అని వ్యాఖ్యానించారు. వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు వన్నెతెచ్చాడనే కీర్తి తీసుకొస్తానని హామీ…
తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని… మాముగనూర రెండోవది అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. కవాడిగూడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్.. చరిత్రాత్మక నగరం ఓరుగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉంది.. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని… మాముగనూర రెండోవది అని కేంద్ర మంత్రి…
మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మించాలన్నది ఎప్పటి నుండో చిరకాల కోరిక అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవాడిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "స్వాతంత్రం రాకముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునూరు ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అవ్వడంతో వరంగల్ విమానాశ్రయానికి తాకిడి తగ్గి హైదరాబాద్ కు పెరిగింది..