దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని తెలిపారు. అనంతరం ఇదిరా గాంధీ గురించి మాట్లాడారు. “దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలి. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉంది. పెహల్గం దాడి తర్వాత.. ఇందిరమ్మ లాంటి ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారు. ఇందిరా గాంధీ పాకిస్థాన్ ను రెండుగా చీల్చి.. నిటారుగా నిలబడింది.” అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
READ MORE: Kakarla Suresh: అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీఠ వేశారు!
అనంతరం.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆ సన్నాసులు చేసే తప్పుడు ప్రచారం తనకు లెక్క కాదని.. లబ్ధిపొందిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలన్నారు. విషం చిమ్మాలని చూస్తున్నారని.. వాళ్ళ గురించి తాను పట్టించుకోనని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐదారుగురు సన్నాసులు ఉండొచ్చని.. వాళ్ళ గురించి పట్టించుకోనన్నారు.
READ MORE: Bhatti Vikramarka: గుడ్‌న్యూస్.. జూన్ 2న రాజీవ్ యువ వికాసం కింద రూ.1000 కోట్లు మంజూరు..!
నల్లమల్ల బిడ్డగా ఆ ప్రాంతం గురించి సీఎం ప్రస్తావించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతమని.. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగిపోతోందన్నారు. పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని గర్వంగా చెప్పుకొంటానన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటునని మరోసారి భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు వాసులను పిలిచేవారని.. ఇక్కడి ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా నిలిచాయన్నారు.