హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అందరినీ ఆశ్చర్య పరిచింది. పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు అనంతరం అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి పాకిస్థాన్, చైనాతో సహా అనేక దేశాలకు ప్రయాణించిందని చెబుతున్నారు. కేవలం రూ.20,000 ఉద్యోగంతో జీవితం ప్రారంభించిన జ్యోతి, ఇప్పుడు ప్రసిద్ధ యూట్యూబర్‌గా మారింది. కానీ ఆమెను ఎందుకు అరెస్టు చేశారు? విదేశాలకు వెళ్ళే ముందు ఆమె తన కుటుంబానికి ఏమి చెప్పింది? పాకిస్థానీ స్నేహితుల గురించి కుటుంబానికి తెలుసా? ఇలాంటి అనేక ప్రశ్నలను జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా మాటల్లో తెలుసుకుందాం..
READ MORE: Manchu Manoj: మంచు విష్ణు నుంచి నేర్చుకోవాలనుకున్నది ఇదే.. మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రశ్న: మీ కూతురిని ఎందుకు అరెస్టు చేసి తీసుకెళ్లారని మీరు అనుకున్నారు? ఆ సమయంలో మీరు ఇంట్లో ఉన్నారా?
జ్యోతి తండ్రి: ఇనే ఇంట్లో లేను. గురువారం పోలీసులు జ్యోతి తీసుకెళ్లారు. ఆమెకు సంబంధించిన వస్తువులను కూడా తీసుకెళ్లారు.
ప్రశ్న: మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది. ఇంతకీ ఏం చేశావని మీరు జ్యోతిని అడిగారా?
జ్యోతి తండ్రి: అడిగినా.. ఆమె నాకు ఏం చెప్పలేదు.
ప్రశ్న: ఇదంతా జరుగుతుంటే.. ఓ తండ్రిగా మీకు భయం వేయలేదా?
జ్యోతి తండ్రి: నేను చాలా ఆందోళన చెందాను. భయం వల్ల నాకు నిద్ర కూడా పట్టలేదు. ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత నాకు జ్వరం కూడా వచ్చింది.
ప్రశ్న: జ్యోతి మీతో ఏదైనా చెప్పే ఉంటుంది కాదా?
జ్యోతి తండ్రి: “నాన్న, ఏదో తప్పు జరిగింది. పరిస్థితి అంతా బాగానే ఉంది. మీరు దిగులు చెందకండి.” అని చెప్పింది. ఇంకేమీ చెప్పలేదు.
ప్రశ్న: ఒక తండ్రిగా ఆమె మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాదా? చెప్తే మీరు బాధపడతారని ఆమె అనుకుందా?
జ్యోతి తండ్రి: అవును, అదే అయి ఉండవచ్చని అనుకుంటున్నా..
ప్రశ్న: జ్యోతి ఇక్కడే నివసించిందా? ఆమె ప్రయాణ అలవాట్ల గురించి మీకు తెలుసా?
జ్యోతి తండ్రి: అవును, ఆమె ఇక్కడే ఉండేది. “నేను ఢిల్లీ వెళ్తున్నాను.. రెండు, నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను.” అని చెప్పింది.
ప్రశ్న: ఆమె పాకిస్థాన్ సందర్శించిందని మీకు తెలుసా? ఆమెకు పాకిస్థానీ స్నేహితులు ఉన్నారా?
జ్యోతి తండ్రి: నాకు ఏమీ తెలియదు.
ప్రశ్న: ఆమెకు పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో స్నేహితులు ఉన్నారని, ఆమె సోషల్ మీడియా పేజీలలో పాకిస్థాన్ అనుకూల కథనాలు కనిపిస్తున్నాయని తేలింది.ఇవన్నీ చూస్తే మీ కుమార్తె ఏదో తప్పు చేసిందని మీకు అనిపిస్తుందా?
జ్యోతి తండ్రి: ఇప్పుడు నేనేం చెప్పగలను… టీవీలో వాళ్ళు చూపించేది సరైనదో కాదో నాకు తెలియదు. అంతా దేవునికి మాత్రమే తెలుసు.
ప్రశ్న: కానీ ఒక తండ్రిగా మీరు ఏమనుకుంటున్నారు?
జ్యోతి తండ్రి: నేను ఏమి చెప్పాలి.. నేను ఏమీ చెప్పలేను.
ప్రశ్న: చేసిన తప్పులకు జ్యోతి మాత్రమే కారణమని మీరు అనుకుంటున్నారా?
జ్యోతి తండ్రి: ఆమె తప్పు చేసింది. ఇప్పుడు ప్రజలకు కనిపిస్తుంది. తప్పు చేస్తోందని నాకు ముందే తెలిసి ఉంటే నేను ఆమెను ఎక్కడికీ వెళ్ళనిచ్చే వాణ్ని కాదు..
ప్రశ్న: ఆమె ప్రవర్తనను బట్టి ఆమె ఏదైనా దాచి పెడుతుందని మీరు అనుకున్నారా?
జ్యోతి తండ్రి: లేదు.. నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు.
ప్రశ్న: ఆమె ఢిల్లీలో ఎప్పటి నుంచి నివసించడం ప్రారంభించింది?
జ్యోతి తండ్రి: కొన్నిసార్లు ఆమె ఒకటి లేదా రెండు రోజుల్లో తిరిగి వచ్చేది. లాక్‌డౌన్‌కు ముందు ఢిల్లీ వెళ్లి ఒక ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేసింది. లాక్డౌన్ విధించినప్పుడు.. వస్తువులన్నీ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఎనిమిది నెలలు ఇంట్లోనే ఉంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత.. ఆమె కొంచెం బయటకు వెళ్లడం ప్రారంభించింది.
ప్రశ్న: మీ కూతురు ఫేమస్ అని మీకు తెలుసా? ఆమెకు యూట్యూబ్ అకౌంట్ ఉంది కాదా? వీడియోలు చూశారా?
జ్యోతి తండ్రి: లేదు.. ఎవరూ నాకు చెప్పలేదు. నా దగ్గర చిన్న ఫోన్ ఉంది. అందులో ఫోటోలు లేదా వీడియోలు రావు.
ప్రశ్న: ఆమె మిమ్మల్ని బాగా చూసుకుందా?
జ్యోతి తండ్రి: అవును.. జ్యోతి మమ్మల్ని బాగా చేసుకునేది.
ప్రశ్న: ప్రభుత్వానికి లేదా పోలీసులకు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?
జ్యోతి తండ్రి: పోలీసులు నన్ను సంప్రదించలేదు. పోలీస్ స్టేషన్ కు పిలువలేదు. ఎవరూ నాతో మాట్లాడలేదు.
ప్రశ్న: అయినప్పటికీ, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?
జ్యోతి తండ్రి: నేనేం చెప్పాలి… ఏం జరిగినా అది మంచికే జరుగుతుంది.
ప్రశ్న: ఆమె నిజంగా తప్పు చేసి ఉంటే, శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారా?
జ్యోతి తండ్రి: చూద్దాం ఏం జరుగుతుందో.. కాలమే చెబుతుంది.
ప్రశ్న: ఆమె పెద్ద తప్పు చేసిందని ఆధారాలు నిరూపిస్తే, మీ కూతురే అయినప్పటికీ ఆమెను శిక్షించాలని మీరు కోరుకుంటారా?
జ్యోతి తండ్రి: జ్యోతి ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షిస్తారు.
జాతీయ మీడియా సంస్థ “ఆజ్‌తక్”తో జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా ఈ విషయాలు పంచుకున్నారు.