‘టీ’ ఈ మాట వింటే కానీ.. చాలా మంది నిద్రలేవరు. పొద్దున్నే టీ సిప్ చేయనిదే కొంతమందికి పొద్దుగడవదు. ప్రపంచవ్యాప్తంగా.. ‘టీ’కి దాసోహమైనవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ.. ఈ వింటర్‌లో వేడి టీ తాగితే ఆ మాజానే వేరుగా ఉంటుంది. ఫలానా సమయానికి టీ తాగనిదే పనులు ముందుకు కూడా సాగవంటే.. అంతలా పవర్, ఫేమస్ ఉంది టీకి. టీలో చాలా రకాలు వచ్చినప్పటికీ.. దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. ఆఫీసుల్లో సైతం ఉద్యోగులు టీకి సపరేట్ టైంని కేటాయిస్తూండటం మనకు తెలిసిన విషయమే. కాగా.. ఈ రోజు (మే 21 శుక్రవారం) అంతర్జాతీయ టీ దినోత్సవం. ఈ సందర్భంగా ఓ వందేళ్ల నాటి టీ స్టాల్ గురించి తెలుసుకుందాం..
READ MORE: HHVM : ‘వీరమల్లు’ పార్ట్-1లో పవన్ పాత్ర అదే.. జ్యోతికృష్ణ క్లారిటీ..
ఈ 100 ఏళ్ల నాటి టీ స్టాల్ ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణంగా ఎక్కడైనా షాపు యజమానులు టీ తయారు చేసి విక్రయిస్తుంటారు. వారే డబ్బులు తీసుకుంటుంటారు. కానీ.. ఈ టీ దుకాణం మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ టీ షాప్ ఓనర్ కేవలం ఉదయాన్నే వచ్చి షాప్ ఓపెన్ చేసి వెళ్లి.. చివరికి రాత్రి వచ్చి దాన్ని మూసివేసి డబ్బులు తీసుకుని వెళ్తాడు. అయితే.. ఒవరినైనా పని వాళ్లని పెట్టి నడుపుతున్నాడని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఈ షాపులో కస్టమర్లలోనే ఎవరో ఒకరు ఛాయ్ చేస్తారు. తాగి డబ్బులు అక్కడ పెట్టి వెళ్తారు. వందేళ్లుగా ఎంతో నమ్మకంతో సాగుతోంది ఈ టీ స్టాల్. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? అని అనుకుంటున్నారా?
READ MORE: Nara Lokesh: కార్యకర్తల బాధ్యత నాది, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటా!
పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్‌లో ఛత్రా కాళీ బాబు శ్మశానవాటిక ఎదురుగా ఈ 100 ఏళ్ల నమ్మకంతో కూడిన టీ స్టాల్ నడుస్తోంది. వంద ఏళ్ల కిందట నరేష్ చంద్ర షోమ్ అనే స్వాతంత్ర్య సమరయోధుడు దీన్ని ప్రారంభించాడట. కస్టమర్లే టీని తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న టీని ఇతరులకు కూడా సర్వ్ చేసుకుంటారు. వాళ్లు తాగిన టీ తాలూకు డబ్బులను ఆ దుకాణంలో పెట్టి వెళ్లి పోతారు. కస్టమర్లే నడుపుతున్న ఈ టీ స్టాల్ ఓనర్ అశోక్ చక్రవర్తి.. ఉదయాన్నే వచ్చి టీ స్టాల్‌ను ఓపెన్ చేసి వెళ్లి పోతారు. తిరిగి రాత్రి 7 గంటలకు వచ్చి మూసేసి డబ్బులు తీసుకుని వెళ్తారు. ఛాయ్ తాగిన కస్టమర్లు ఎంతో నమ్మకంతో డబ్బులు గల్లాపెట్టెలో వేసే వెళ్తారు. ఈ స్టాల్‌లో ఇంత వరకు దొంగతనం జరగలేదని.. టీ తాగిన కస్టమర్లు డబ్బులు అక్కడ పెట్టకుండా వెళ్లిన దాఖలాలు లేవని చెబుతున్నారు.