న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ నుంచి మరో అధికారిని భారత్ బహిష్కరించింది. ఆ అధికారిని పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. 24 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. తన హోదాకు అనుగుణంగా నడుచుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఆ అధికారిని భారత ప్రభుత్వం పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఈ నెలలో ఇది రెండోసారి బహిష్కరణ. మే 13న.. ఓ పాకిస్థాన్ అధికారిని భారత్ బహిష్కరించింది.
READ MORE: Amrit Bharat Stations: ప్రధాని మోడీ చేతుల మీదుగా ‘అమృత్ భారత్ స్టేషన్ల’ ప్రారంభోత్సవం..!
కాగా.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్న నేపథ్యంలో దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం.. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ దాడి తర్వాత, భారత్ పాకిస్థాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ పరిమాణాన్ని 55 నుంచి 30 మంది సభ్యులకు తగ్గించింది. దీర్ఘకాలంగా ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారి-వాఘా భూ సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేసింది. ఈ చర్యలలో భాగంగా ఇస్లామాబాద్‌లో ఉన్న భారత దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించారు.
READ MORE: Terror Plot: దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసు కీలక విషయాలు.. ఆర్‌ఎస్ఎస్ నేతలే టార్గెట్!