పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా మరణం పట్ల పాకిస్థాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) సింధ్ యూనిట్ సంతాప సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వక్తలు ఒకవైపు.. ఉగ్రవాది సైఫుల్లా మరణంపై విచారం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు భారతదేశంపై విషం చిమ్మారు. ఇది మాత్రమే కాదు.. ఈ సమావేశంలో పాకిస్థాన్ సైన్యం, పాక్ చీఫ్ జనరల్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను బహిరంగంగా ప్రశంసించారు. ‘మర్కా-ఎ-హక్’ పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సాన్నిహిత్యం మరోసారి బహిరంగంగా ప్రదర్శించారు.
READ MORE: Gulzar House: అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం.. పలు శాఖల సమగ్ర నివేదికలను కోరిన పోలీసులు..!
కాగా.. ఇటీవల భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదులకు ఆర్మీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం, పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమ అధికారులు పాల్గొనలేదని ముందు దాయాది బుకాయించినా.. భారత్ ఆధారాలు విడుదల చేసేసరికి పాక్ గొంతులో పచ్చి వెలక్కాయపడ్డయ్యింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ఆర్మీ అధికారుల వివరాలను భారత్ విదేశాంగశాఖ తాజాగా బయటపెట్టింది. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉండటం గమనార్హం. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ భూభాగంలో మురీద్‌కేలోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. తాజాగా మరోసారి పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధం బయటపడింది.
READ MORE: Gulzar House: అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం.. పలు శాఖల సమగ్ర నివేదికలను కోరిన పోలీసులు..!