రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగ యువతకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సాయం చేయనున్నారు. మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది.
తాను దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, కిషోర్ ప్రినిపల్ సెకరెట్రి, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కుమురం భీమ్, బిర్శా ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం రూ. కోటి 50 లక్షల విలువైన పనులు ప్రారంభించారు.
గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించింది. 783 పోస్ట్ ల భర్తీకి 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు వాయిదా పడి గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష జరిగింది. 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది పరీక్ష రాశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను…
మొన్న సంగారెడ్డి, నిన్న మెదక్, నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం సృష్టిస్తోంది. బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు అనే తేడా లేకుండా వరుసగా కోళ్లు మృతి చెందుతున్నాయి. వర్గల్ (మం) మజీద్ పల్లి గ్రామంలోని పౌల్ట్రీఫామ్ లో రెండ్రోజుల్లో 10 వేల కోళ్ల మృత్యువాత పడ్డాయి. వెటర్నరీ అధికారులు కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు. ఏ రోగంతో చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే కోళ్ల మృతిపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. ఇప్పటికే రెండు ట్రోఫిలు సొంతం చేసుకున్న టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందారు.. 1978 నుంచి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా కొనసాగారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపే (మార్చి 10వ తేదీ) నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా.. జనసేన, బీజేపీకి ఒక్కో సీటు ఇచ్చింది. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన స్థానాలకు ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. 8,9 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో అవకాశం లేదు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ 251 పరుగులు చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచేందుకు భారత్ 252 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ మొదట్లో న్యూజిలాండ్ జట్టు 270-280 స్కోరును సులభంగా సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాటర్స్‌కి సాధ్యం కాలేదు. 4 క్యాచ్‌లు వదిలివేసినప్పటికీ.. భారత స్పిన్నర్లు న్యూజిలాండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని 251 పరుగులకే పరిమితం చేశారు.