పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరీ ఎక్కువ సమయం వృథా అవుతుందనే ఉద్దేశంతో దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్‌ను వీడిన విషయం తెల్సిందే. దాంతో జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే.
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు మంచి సక్సెస్‌ను అందించాయి. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చేస్తున్న కోర్టు సినిమా గురించి కూడా ముందు నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు.. "ఈ సినిమా ఈవెంట్లో ఈ సినిమా థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చకపోతే నేను హీరోగా నటించే హిట్ 3 చూడవద్దు" అంటూ నాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి.
రాబోయే ఆర్థిక సంవత్సరంతో ఫ్రెషర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక ఏడాదిలో దాదాపు 150,000 ఉద్యోగ నియామకాలు చేపడతారని అంచనా. ఈ ఉద్యోగాల సంఖ్య గత సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు. టీమ్‌లీజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85,000 నుంచి 95,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాలలో కంపెనీలు తమ శ్రామిక శక్తిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాయని టీమ్‌లీజ్…
బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు." కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరె కటికల పాత్ర ఉంది. బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడొ యాత్ర చేపట్టారు. బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కుల సర్వే జరగాలనేది రాహుల్ గాంధీ ఆశయం.
టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎం చంద్రబాబుకి మంత్రి కొండా సురేఖ తెలంగాణ దేవాదాయ శాఖ లేఖ రాశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకువచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులందరికీ ఉపయోగపడుతుందని, వారందరి తరపున తాను ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. అయితే, తెలంగాణ నుంచి తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిందని, రాష్ట్రం…
ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత స్పందించింది. "ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. న్యాయస్థానంలో న్యాయం జరిగింది. పోలీస్ శాఖకు, వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ, సహకరించిన మీడియాకు ధన్యవాదాలు. బాబు ఎదుగుతున్న నేపథ్యం... అతని భవిష్యత్తు, నా మానసిక పరిస్థితి దృష్ట్యా మీడియా ముందుకు రాలేకపోతున్నాను. నా అభ్యర్థనను అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్న." అని అమృత పేర్కొంది.
నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై 2020లో నమోదైన కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకూ నోటీసులు జారీ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. 2020లో కేటీఆర్ ఫాంహౌజ్‌పైన డ్రోన్ ఎగరేసి చిత్రీకరించారని రేవంత్ రెడ్డి పై అభియోగం మోపారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (52) హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఏడో బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపైనా కోర్టులో…
అన్ని కేసుల్లో బెయిల్స్ పోసాని కృష్ణ మురళికి సంబంధిత న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. నిన్న నర్సారావుపేట కోర్టు, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరు చేశాయి. అంతకుముందే రాజంపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానిపై మొత్తంగా 17 కేసులు నమోదయ్యాయి. మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.