నేపాల్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో ఓ వివాహ వేడుకకు సంబంధించినది. ఆహ్వానం లేని అతిథి వివాహానికి వచ్చారు. ఇందులో ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా జరిగేదే కాదా? అనుకుంటున్నారు కదా.. కానీ.. ఈ అతిథి సాధారణ అతిథి కాదు. అడవి నుంచి నేరుగా వచ్చిన ‘రైనో’ (ఖడ్గమృగం). ఈ క్లిప్ ను చూసిన జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి దృశ్యం నేపాల్‌లో మాత్రమే చూడగలమని కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టితో త్రిమెన్ కమిటీ భేటీ.. ఉద్యోగుల సమస్యలపై ఆరా
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లికి హాజరైన ఖడ్గమృగం చాలా ప్రశాంతంగా కనిపించింది. వివాహ మండపానికి ఎటువంటి నష్టం కలిగించలేదు. బంధువుల్లో ఎటువంటి గందరగోళం సృష్టించలేదు. నేరుగా వీఐపీ తరహాలో ఎంట్రీ ఇచ్చింది. మండపం సమీపంలో తిరిగి.. ఆపై అడవి వైపు తిరిగి వెళ్లింది. ఖడ్గమృగం ఆ జంటను ఆశీర్వదించడానికి వచ్చిందని, ఇబ్బంది పెట్టడానికి రాలేదని బంధువులు చెబుతున్నారు. ఈ వీడియో నేపాల్‌లోని చిట్వాన్ ప్రాంతానికి చెందినదని తెలుస్తోంది.
READ MORE: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టితో త్రిమెన్ కమిటీ భేటీ.. ఉద్యోగుల సమస్యలపై ఆరా
వైరల్ అవుతున్న వీడియోలో.. పెద్ద ఖడ్గమృగం వివాహ వేదిక గేటులోకి ప్రవేశించడం చూడవచ్చు. అదే సమయంలో ఆ వేడుకకు హాజరైన ప్రజలు ఈ అనామక అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. వారిలో కొందరు వెంటనే దాని వెంట వీడియోలు తీస్తూ కనిపించారు. అయితే, ఖడ్గమృగం ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. @nepalinlast24hr అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోపై వ్యాఖ్యల వరద వచ్చింది. ఇది నిజమైన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని కొందరు కామెంట్ చేశారు.