భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్‌మైన్‌లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు త్వరలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ సముపార్జన మండలి (DAC) నుంచి ఆమోదం లభించే అవకాశం ఉంది.
READ MORE: Minister Gottipati Ravi: గత ప్రభుత్వ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు..
MCMV అంటే ఏమిటి?
మైన్ కౌంటర్ మెజర్ వెసెల్(MCMV ) అనేది ఒక ప్రత్యేక రకమైన నావికాదళ నౌక. ఇది సముద్రం కింద దాగి ఉన్న మందుపాతరలను గుర్తించి నాశనం చేయడానికి రూపొందించనున్నారు. ఈ నౌకల పొడవు దాదాపు 60 మీటర్లు, వాటి బరువు 1000 టన్నుల వరకు ఉంటుంది. అవి సాంప్రదాయ యుద్ధనౌకల కంటే చిన్నవిగా కనిపించినప్పటికీ.. యుద్ధ సమయంలో వాటి పాత్ర నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఈ నౌకలలో అధునాతన సోనార్, రోబోటిక్ పరికరాలు, అయస్కాంతేతర పదార్థాలు ఉపయోగిస్తారు. తద్వారా శత్రు మందుపాతరలు ఈ నౌకలను ట్రిగ్గర్ చేయలేవు.
READ MORE: Mock Drill: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్.. భారత్ కొత్త ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోందా?
భారత నావికాదళం వద్ద ప్రస్తుతం ఒక్క మైన్ స్వీపర్ కూడా లేదు. పాత మైన్ స్వీపర్లను చాలా సంవత్సరాల క్రితం రద్దు చేశారు. అటువంటి పరిస్థితిలో.. ఈ ప్రాజెక్ట్ భద్రతా పరంగా చాలా ముఖ్యమైనదిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి.. భారత్‌కు అతిపెద్ద శత్రువు చైనా. చైనా తన నావికా ప్రాంతాన్ని నిరంతరం విస్తరిస్తోంది. పాకిస్థాన్ కూడా సముద్రంలో జలాంతర్గాములు, ఆధునిక నౌకల సంఖ్యను పెంచుతోంది. అటువంటి పరిస్థితిలో.. భారత్ తీరప్రాంతం, ఓడరేవులు, సముద్ర మార్గాలను రక్షించుకోవడానికి ఈ MCMV ల వంటి వనరులు చాలా అవసరం.
READ MORE: Mock Drill: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్.. భారత్ కొత్త ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోందా?