Kidney Stone Risk: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎందుకు పెరుగుతుంది? నివారణ చర్యలు..!
- కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు
- పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి
- యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట
- వేసవిలో మరింత పెరుగుతున్న కిడ్నీ రాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్‌లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్‌లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.
READ MORE: TTD: తిరుమల మెట్ల మార్గంలో మళ్లీ చిరుతల అలజడి.. నిపుణులతో టీటీడీ ఈవో భేటీ
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
వేసవిలో కిడ్నీ స్టోన్‌కు అతి పెద్ద కారణం ఉష్ణోగ్రత పెరగడం. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ ప్రభావం మూత్రపిండాలపై కూడా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో కిడ్నీపై హానికరమైన ప్రభావం చూపే శీతల పానీయాలను ఎక్కువగా తీసుకుంటాం. ఇది కూడా స్టోన్స్‌కు కారణమవుతుంది. శరీరంలో నిరంతరం డీహైడ్రేషన్ సమస్య కారణంగా, కిడ్నీలో చిన్న స్ఫటికాలు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి.
READ MORE: CM Revanth Reddy: భూభారతి పేద రైతులకు చుట్టం.. అవగాహన సదస్సులు నిర్వహించాలి
నివారణ చర్యలు..
వేసవిలో ఎక్కువ నీరు త్రాగాలి. తక్కువ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కిడ్నీ స్టోన్‌ను నివారించాలనుకుంటే, జ్యూస్ తీసుకోండి. సీజనల్ పండ్లు, కూరగాయల రసం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీలో రాళ్ల నుండి కాపాడుతుంది. వేసవిలో పైనాపిల్ తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా.. పైనాపిల్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా బాగుంటుంది. పీచు పుష్కలంగా ఉండే పైనాపిల్ కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!