భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి యుజ్వేంద్ర చాహల్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరుకున్నాడు. కానీ ఒంటరిగా కాదు. ధనశ్రీ వర్మ నుంచి విడాకుల వార్తల మధ్య.. అతను ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. మ్యాచ్ సమయంలో కెమెరా మ్యాన్ చాహల్, తన కొత్త స్నేహితురాలిపై దృష్టి పెట్టాడు.
నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడేవారని.. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు.
భారతదేశం- న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు ఆదరించింది. ‘చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలకు కాంగ్రెస్ సర్కారు అండగా ఉంటుంది. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాం. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నలకు కూడా మాఫీ చేస్తాం. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాం’ గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగిస్తోంది. మరోవైపు ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కొంతమందికి ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి వివరించినట్టు సమాచారం. ఖరారైన అభ్యర్థుల వివరాలు సాయంత్రం లోగా రానున్నాయి. నామినేషన్ కు రెడీ గా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తీవ్ర ఉత్కంఠ రేకిత్తిస్తోంది.
దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్స్‌ను రూ.11,600 కోట్లతో మంజూరు చేస్తూ నిన్న జీవో జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్ కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు..
పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించనున్న 12వ ఆవిర్భావ సభకు మహిళలను ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆడపడుచులను ఆహ్వానించేలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన బొట్టు స్టిక్కర్లతో కూడిన ఆహ్వాన పత్రికను ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ కంట్రోల్ రూమ్ లో ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ఆడపడుచులను ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానించనున్నారు.
త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. "తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసి... తెలంగాణ వచ్చాకే పదవులు తీసుకుంటా అని చెప్పిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. బీఆర్ఎస్ కి పురుడు పోసింది కొండా బాపూజీ. పార్టీ పెట్టినప్పుడు నీడ కల్పించింది ఆయనే.. కానీ ఆయనకు నిలువ నీడా లేకుండా చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం…
చేనేత కార్మికులకు మంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. చేనేతల రుణాలు వచ్చే బడ్జెట్ లో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. "మీకు నష్టం జరిగే ఏ పని చేయదు. నేతన్నలకు సాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కుల గణన విషయంలో రేవంత్ రెడ్డిని చాలా మంది వ్యతిరేకించారు. కానీ రాహుల్ గాంధీ మాట నిలబెట్టేందుకు కుల గణన చేశారు. కుల గణన చేసిన…
"పిల్లల్ని నేను కిడ్నాప్ చేయలేదు.. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం.. లక్ష రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాం.. ఆ తర్వాత పిల్లలు లేని వాళ్లకు వారిని అమ్మి సొమ్ము చేసుకున్నాం. ఒక్కొక్క పిల్లాడికి ఐదు నుంచి పది లక్షల రూపాయలుకు అమ్మివేశాం.. మేము కిడ్నాపర్లం కాదు. కేవలం పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ మాత్రమే అమ్మినం.." ఇది పసి పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న నిందితుల వాదన.