How To Look Young : వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.. యవ్వనంగా కనిపిస్తారు..!
- వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు
- క్రమంగా ముడతలు పడుతున్న చర్మం
- ఈ రకమైన పండ్లు, కూరగాయలు తినండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయసు పెరుగుతున్న కొద్దీ మన ముఖంలో, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. చర్మం ముడతలు పడి అందం కోల్పోతుంది. శరీర ఆకృతి, సౌష్టంలో తేడాలోస్తాయి. అయితే మన ఆలోచనలు, అలవాట్లు, జీవనశైలి సవ్యంగా ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ అందంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండవచ్చు. ఈ రకమైన పండ్లు, కూరగాయలు తింటే యవ్వనంగా కనిపిస్తారట. ఆ పండ్లు ఏంటి? అవి తినడం వల్ల ఎలాంటి లాభం చేకూరుతుందో ఇప్పుడు చూద్దాం..
బొప్పాయి పండు:
బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది.
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
దానిమ్మ పండు:
దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు చర్మ సమస్యలు కూడా ఉండవు.
పెరుగు:
పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది.
ఆకు కూరలు:
ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది.
టమోటా:
టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
వీటికి దూరంగా ఉండాలి!
నిద్ర సమస్య ఉన్నవారు నిద్రకు ముందు మద్యపానం, కెఫిన్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా కలిగే దుష్ఫలితాలు అనేకం. ఈ రోజుల్లో చాలామంది కనీసం 10 నుంచి 12 గంటల వరకు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొందరు వృత్తిరీత్యా ఈ పనిచేస్తుంటే.. మరికొందరు కాలక్షేపానికి ఎక్కువసేపు స్క్రీన్‌పైనే తమ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. ఇది మన కళ్ల మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం వల్ల ఏర్పడే తరంగాలు కూడా మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తద్వారా మీ ఏజింగ్ ప్రక్రియ వేగంగా జరిగి మీ ముఖంలో యవ్వన ఛాయలు చిన్న వయసులోనే తగ్గిపోతాయి.
తాజావార్తలు
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!