గంజాయి డాన్ అంగూరు భాయ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అంగూరు భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉంది. దూల్పేట్ సీఐ మధుబాబు.. అంగూర్ భాయ్‌కి పీడీ జీవోను అందించారు. రాష్ట్రం కాని రాష్ట్రంలోకి వచ్చి.. తెలంగాణలోని దూల్పేట్లో స్థిరపడి.. గంజాయి డాన్‌గా ఎదిగిన అంగూర్ భాయ్‌పై ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పీడీ యాక్ట్ ఆదేశాలు జారీ చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీకి రానున్నారు. 9:30 నిమిషాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సూచించారు. ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరుకావాలని సూచించారు. అరగంట ముందుగా 9:30 కే అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఎల్పీలో సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.
స్విఫ్ట్ కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంజీఐటీ కాలేజ్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న.. 6గురూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు డుమ్మా కొట్టారని తెలిపారు. "ఒక్కసారి స్టూడెంట్స్ కాలేజ్ లోనికి వచ్చారంటే బయట వెళ్ళడానికి వీలులేదు. నార్సింగి మూవీ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని మధ్యహ్నం 3:30 గంటలకు సమాచారం అందింది.
జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ దేవాదాయశాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హైదరాబాద్ బొగ్గులకుంటలో జరిగిన ఈ ఆందోళనకు కొత్తకోట ఆశ్రమ అర్చకుడు శివానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శక్తిపీఠాలలో ఒక పీఠం అయిన అలంపూర్ జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పై క్రిమినల్ కేసులు ఉన్నందున.. వెంటనే సస్పెండ్ చేయాలని…
పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. కర్నూలు జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే పోసాని కస్టడీ పిటిషన్ ను మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించిన కేసులో నిందితుడు పోసాని.. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు. ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు…
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నాగర్‌లోని శ్రీ వినాయక దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అక్కచెల్లెలు స్వర్ణలత, పావని శివపార్వతుల విగ్రహాలు దొంగతనం చేశారు. కుటుంబంలో తరచూ ఒకరు చని పోతుండటంతో విగ్రహాన్ని ప్రతిష్టించాలని బాబా చెప్పారు. బాబా మాటలు విని దేవుడు విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాలు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో గుడిలో విగ్రహాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఎస్ఆర్ నగర్లో ఉన్న ఒక గుడిలో శివ పార్వతల…
మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీడీవో దుబ్బ సత్యం ఫిర్యాదు మేరకు రఘునందన్ పై కేసు నమోదైంది. ఈ కేసును తాజాగా కోర్టు కొట్టేసింది.
యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బైక్‌లు, కార్లలో వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాహనాలు వేగంగా ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా నార్సింగి పరిధిలో ఓ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బలయ్యారు.
కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు."రెండు నెలలలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు.
జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవలే కిడ్నప్ కు గురైన 10 నెలల పసి పాప శివాని కేసును జనగామ పోలీసులు ఛేదించారు. పాపను కిడ్నప్ చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఏసీపీ పండేరి చేతన్ నితిన్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన రామ్ జూల్ - పార్వతి దంపతులు జిల్లా కేంద్రంలో కూలి పని చేస్తూ జీవన కొనసాగిస్తున్నారు..