ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు.
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కస్ స్టాయినిస్ (26) టాప్ స్కోరర్. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18),…
సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా సీఐడీ పోలీసులు కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.
2019 శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రభుత్వం కుట్ర చేసి తనను కొడంగల్ లో ఓడిస్తే.. పద్నాలుగు రోజుల్లో ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు.. ఎన్నికల్లో రక్తాన్ని చెమటగా మార్చారని.. కాబట్టే మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డానన్నారు. తాజాగా బాచుపల్లిల వీఎన్ఆర్ కాలేజ్ నుంచి ప్రారంభమైన జై హింద్ ర్యాలీలో సీఎం ప్రసంగించారు.. ఖర్గే.. రాహుల్ గాంధీ.. ఆదేశాల మేరకు జై హింద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇవాళ ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో కలుపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేయొచ్చన్నారు.. బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటోందని.. కవిత కలిసి ఏం చేస్తదని విమర్శించారు. అందులో కొందరు చనిపోయారని.. కొందరు ఇంకెక్కడో ఉన్నారో తెలియదు, మరి కొందరు పార్టీలు మారారని చెప్పారు.
హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్స్ను డిపోర్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్ పోర్ట్ లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను ప్రారంభించిన ఆయన కార్యక్రమంలో ప్రసంగించారు. నైజీరియన్లను వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారని భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సంచలన విషయాన్ని తెలిపారు.
దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు జరిగింది. మొదటి విడతలో 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఫేస్ 1 లో 65 వేల 191 మంది విద్యార్థులు ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. అందులో 60 వేల 436 మంది సీట్లు పొందారు. ఈ సారి కూడా కామర్స్ కే డిగ్రీలో గిరాకీ పెరిగింది. కామర్స్ లో 21 వేల 758 సీట్లు భర్తీ అయ్యాయి. లైఫ్ సైన్సెస్ లో 11 వేల 5 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఫిజికల్ సైన్సెస్ లో 15…