ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (GT) ఈరోజు ముంబై ఇండియన్స్ (MI)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 2228 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అగ్ని ప్రమాదం సమాచారం అందగానే హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒకేసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలను హైడ్రాకు చెందిన 5 డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి మంటలు వ్యాప్తి చెందకుండా ఆపాయి.
బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులను కోయకుండా సీఎం, డీజీపీ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. పండుగ ఎలా జరుపుకుంటారో తమకు అనవసరమని.. కానీ పశువులను కోస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తాము బాధ్యులం కాదని తేల్చిచెప్పారు. పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.
గుల్జర్ హౌస్ అగ్నిప్రమాదంపై బాధితులు మీడియా ముందుకు వచ్చారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని సంచలన కామెంట్స్ చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరుపాలని సంతోషి గుప్త అనే బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే మా ఫ్యామిలీలో 17 మంది నీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడటం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గంట వరకు అగ్నిమాపక…
ఆర్సీబీ.. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఫ్యాన్ బేస్, ఆటపరంగా చూస్తే సీఎస్కే, ముంబై ఇండియన్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు..! ఐపీఎల్ 18 సీజన్లలో పది సార్లు ప్లే ఆఫ్స్కు వెళ్లినా ఫలితం శూన్యం. ముంబై ఇండియన్స్ 11 సార్లు ఈ ఫీట్ సాధించింది. ఇక ఈసారి మాత్రం ఆర్సీబీ.. ప్రత్యర్థి జట్లకు హడల్ లెత్తిస్తూ..
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు షామిర్ పేటలో కలిశారన్నారు. ఒక ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పారు కాబట్టే హరీష్, ఈటల కలిశారన్నారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో అంత ఒకటే సమాధానం చెప్పాలని మాట్లాడుకున్నారన్నారు.
కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్నగర్లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై కవిత ఆరోపణలు చేయడం ఏంటి? కవిత ఎందుకు జైలుకు పోయింది? వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటి? అని ప్రశ్నించారు. ఇది డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ సమస్య అని స్పష్టం చేశారు. అది ఓ డ్రామా.. వాళ్ళ డ్రామాలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని తెలిపారు.
నిన్న జైహింద్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను, పాక్ కీలకమైన సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన విషయాన్ని మనం చూశామని.. ఆపరేషన్ సిందూర్…
ఎర్రవెల్లి ఫాంహౌస్లో కేసీఆర్, హరీష్రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు.