Solapur Tragedy: డీజే ముందు డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ వేడుక ఊరేగింపులో డీజే ముందు నృత్యం చేస్తున్న యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. మృతుడిని 25 ఏళ్ల అభిషేక్ బిరాజ్‌దార్‌గా గుర్తించారు. నగరంలోని ఫౌజ్‌దార్ చావ్డి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
READ MORE: Chiranjeevi : చిరంజీవి మధ్యవర్తిత్వం.. రేపు కార్మికులతో సమావేశం?
పోలీసుల సమాచారం ప్రకారం.. అభిషేక్ తన స్నేహితులతో కలిసి డీజే ముందు డ్యాన్స్ చేస్తున్నాడు. సౌండ్ భారీగా వస్తోంది. కొంతసేపు డ్యాన్స్ చేసిన తర్వాత.. వెళ్లి ఒక మూలలో నిలబడ్డాడు. అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. అతని స్నేహితులు, అక్కడ ఉన్న వ్యక్తులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అభిషేక్ చనిపోయినట్లు నిర్ధారించారు. డీజే శబ్ధం ధాటికి గుండెపోటు సంభవించి మృతి చెందినట్లు చెబుతున్నారు. పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో అభిషేక్ డీజే ముందు ఉత్సాహంతో నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో ప్రజలను మరింత కలవరపెట్టింది. షోలాపూర్‌లో డీజేలపై సమయం, సౌండ్‌కి సంబంధించి పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ అనేక కార్యక్రమాల్లో ఈ నియమాలను బహిరంగంగా విస్మరిస్తున్నారు. ఇప్పుడు అభిషేక్ మరణం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది.
READ MORE: Malnadu Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. ఎవరంటే..?