Constable Suicide: ఏం కష్టం వచ్చిందో.. ఏమో..! 18ఏళ్లు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అద్దె ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో అల్లం బాలరాజు (40) అనే బెటాలియన్ కానిస్టేబుల్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ములుగు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ బాలరాజు అద్దెకు ఉంటున్న ఇంటిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గంగారం 15వ బెటాలియన్ లో దాదాపు 18 ఏళ్లు కానిస్టేబుల్ గా విధులు నిర్వహించాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Janaki V vs State of Kerala: : ఓటీటీలోకి వివాదస్పద సినిమా.. ఎప్పుడంటే?
మరోవైపు.. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కిరణ్ అనే కానిస్టేబుల్.. శ్రీనివాస్ నగర్ లోని ఇంట్లో ఒంటి పై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 60 శాతానికి పైగా గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్నతాధికారులు విధి నిర్వహణలో అవకతవకల వల్ల విధుల నుంచి తొలగించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో గాంధీకి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.