ఓ భగ్న ప్రేమికురాలు తన వ్యక్తిగత సమస్యను.. జాతీయ సమస్యగా చేయాలని ప్రయత్నించింది. తనకున్న టెక్నాలజీ తెలివి తేటలను వాడుకుని పోలీసుల కళ్లను కూడా బురిడీ కొట్టింది. చివరికి చిన్న మిస్టేక్‌తో దొరికిపోయింది. ఇంతకీ ఆ కిలాడీ లేడీ ఎవరు? ఏం చేసింది? కొద్ది రోజుల కింద దేశవ్యాప్తంగా విమానాశ్రాయలకు, కార్పోరేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి గుర్తుందా..? అది ఉగ్రవాదుల పని అయి ఉంటుందని పోలీసులు, నిఘా సంస్థలు అనుమానించాయి. ఆ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేశాయి. చివరకు ఈ కేసులతో లింక్ ఉన్న ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
READ MORE: Triple Murder: వీడిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ.. మూడు ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం..!
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు రెనీ జోషిల్దా. చెన్నైకి చెందిన ఈమె ఓ రోబోటిక్ ఇంజినీర్. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో దిట్ట. ఈమె ప్రతిభకు మెచ్చిన మల్టీ నేషనల్ కంపెనీ డెలాయిట్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగం ఇచ్చింది. ఆ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేసిన రెనీ.. తన సహోద్యోగి దివిజ్ ప్రభాకర్‌ను ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని భావించింది. అందమైన జీవితాన్ని ఊహించుకుంది. అనివార్య కారణాలతో ఆ ప్రేమను తిరస్కరించిన ప్రభాకర్.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో అతడిపై కక్షకట్టిన రెనీ.. ఎలాగైనా ప్రియుడిని కటకటాల పాలు చేయాలని భావించింది. దీంతో అతని భార్య విడాకులు ఇస్తుందని ఊహించింది. ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా ప్రియుడు ప్రభాకర్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. తన ల్యాప్‌టాప్ నుంచి డార్క్‌వెబ్‌ను యాక్సెస్ చేసింది. దాని ద్వారానే తన వివరాలు పొందపరచకుండా ప్రభాకర్ పేరు, వివరాలతో ఈ- మెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. VPN ద్వారా ఇంటర్‌నెట్‌ను యాక్సెస్ చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలు, కార్పొరేట్ స్కూళ్లు, ఆస్పత్రులకు 22 బెదిరింపు మెయిల్స్ పంపింది. ఒక ప్రాంతానికిని పంపిన మెయిల్‌లో మరో ప్రాంతంలో ఓ నేరం జరిగినట్లు, దాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడానికే బాంబు పెట్టినట్లు రాసింది. అహ్మదాబాద్‌కు పంపిన ఓ ఈ-మెయిల్‌లో 2023లో హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో బాలికపై అత్యాచారం చేసిన రేపిస్ట్ విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడానికి మీ స్కూల్‌లో బాంబు పేల్చబోతున్నాని ప్రస్తావించింది. వీటిలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు మెయిల్ కూడా ఉంది. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
READ MORE: HDFC APK File Scam: ఏపీకే ఫైల్స్‌తో స్కామ్.. హెచ్‌డీఎఫ్‌సీ సీరియస్ వార్నింగ్!
ఇలా రెనీ తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్‌ల్లోని వివిధ సంస్థలకు మెయిల్స్ పంపినా ఆచూకీ పోలీసులకు చిక్కలేదు. ప్రభాకర్‌ను అనుమానితుడిగా భావించడం, విచారణ అనంతరం వదిలేయడం జరిగాయి. అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం కూలి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆ మర్నాడు అదే కాలేజీకి పాక్ ఉగ్రవాదుల పేరుతో మెయిల్ పంపిన రెనీ మరోసారి విధ్వంసం తప్పదని హెచ్చరించింది. దీంతో రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. అప్పటి వరకు 12 రాష్ట్రాలకు వచ్చిన 22 ఈ-మెయిల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అధ్యయనం చేశారు.. ఎప్పుడు మెయిల్స్ పంపినా డార్క్ వెబ్, VPN యాక్సెస్ చేసుకునే రెనీ.. ఓ రోజు మొబైల్ డేటా ద్వారా హాట్ స్పాట్ కనెక్ట్ చేసుకుని VPNను యాక్టివేట్ చేసింది. ఆ సమయంలో పొరపాటున రెనీ ల్యాప్ టాప్ ఆమె నివసిస్తున్న ఫ్లాట్ వైఫైకి కనెక్ట్ అయింది. దీంతో ఆమె పంపిన మెయిల్‌లో IP అడ్రస్ రికార్డయింది. దీంతో రెనీ దొరికిపోయింది. లొకేషన్ సేకరించిన పోలీసులు చెన్నైలోని ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశారు.