Dhurandhar : 30 ఏళ్ల క్రితం పాటకి 46 లక్షలిచ్చారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్దాలు గడిచినా ఆ ట్యూన్ వినపడగానే కుర్రకారు స్టెప్పులు వేయాల్సిందే, అలాంటి ఒక సెన్సేషనల్ సాంగ్ ‘హవా హవా’. 1980వ దశకం చివరలో ఇండియాను ఓ ఊపు ఊపేసిన ఈ పాట వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ పాట పాడిన గాయకుడు హసన్ జహంగీర్ కు ఇప్పుడు ఏకంగా 46 లక్షల రూపాయల పారితోషికం దక్కడం. 1987లో హసన్ జహంగీర్ ఆలపించిన ‘హవా హవా’ పాట ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ రోజుల్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ రేడియో స్టేషన్ ఆన్ చేసినా ఈ పాట మార్మోగిపోయేది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా ‘ధురంధర్’ లో సంజయ్ దత్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఈ పాటను బ్యాక్‌డ్రాప్‌గా వాడుకున్నారు. అప్పట్లో కాపీరైట్ చట్టాలు ఇప్పుడున్నంత పటిష్టంగా లేవు. అయినా సరే, ఆ పాట సృష్టించిన ఇంపాక్ట్ దృష్ట్యా చిత్ర యూనిట్ ఆయనకు క్రెడిట్ ఇవ్వడమే కాకుండా భారీ మొత్తాన్ని చెల్లించింది.
Also Read : SS Thaman: నాకు కాపీ కొట్టడం రాదు.. అందుకే దొరికిపోతా: థమన్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం పాడిన పాటను గుర్తుపెట్టుకుని మరీ, దానికి ప్రతిఫలంగా 50 వేల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 46 లక్షల రూపాయలు) హసన్ జహంగీర్‌కు అందజేశారు. ఒక గాయకుడి ప్రతిభను గుర్తించి, కాపీరైట్ ఇబ్బందులు లేకపోయినా నైతికంగా ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడం సంగీత పరిశ్రమలో ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. పాకిస్థానీ గాయకుడైన హసన్ జహంగీర్ ఈ ఒక్క పాటతోనే సరిహద్దులు దాటి అభిమానులను సంపాదించుకున్నారు. నేటి తరం రీమిక్స్ పాటల యుగంలో ఉన్నా, ఒరిజినల్ ‘హవా హవా’ పాట ఇచ్చే కిక్కు వేరనే చెప్పాలి. ఒక కళాకారుడి కష్టానికి దశాబ్దాల తర్వాత కూడా ఇలాంటి గుర్తింపు దక్కడం నిజంగా అభినందనీయం.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!