పోలవరం గ్రామానికి చెందిన యువతి అమెరికాలో తన ప్రతిభతో మన్ననలు అందుకుంటోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం భామ "మిస్ తెలుగు యూఎస్ఏ" కిరీటం సొంతం చేసుకుంది. పోలవరానికి చెందిన జాగాబత్తుల దుర్గాప్రసాద్, శ్రీవల్లి దంపతుల ఏకైక కుమార్తె నాగ చంద్రికా రాణి అమెరికాలోని ఫ్లోరిడాలో ఎంఎస్ చదువుతోంది. ఈనెల 25వ తేదీన డల్లాస్‌లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మిస్ తెలుగు యూఎస్ఏ పోటీలు నిర్వహించారు.
మహానాడులో దివంగత ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణమని మాజీ ఎంపీ భారత్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారని సంచలన వ్యాఖ్య చేశారు.
వైయస్సార్ కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా? అని ప్రశ్నించారు. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారని ఆరోపించారు.…
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి ఆయన హాజరయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణ ముగిసింది.. రెండు గంటలపాటు సీఐడీ అధికారులు ఆర్కేను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. నోటీసు ఇవ్వడంతో తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. తాను ఆ రోజు లేనని... దాడి జరిగిన అంశం నాకు…
గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు.. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని.. వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని పేర్కొన్నారు. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయని. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్రం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఇది గతేడాది నుంచి ఆపరేషన్ ఊపందుకుంది.
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ హెచ్చు తగ్గులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎకో తీయించడంతో గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి స్పెషల్ వార్డులో పీఎస్సార్ ఆంజనేయులును ఉంచారు. ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు.