మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు… తాను ఏది మాట్లాడిన మంత్రి పదవి కోసమే అని ప్రచారం చేస్తున్నారన్నారు.. తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని.. పదవుల కోసం నేను ఎవరి కాళ్లు మొక్కనన్నారు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా.. అవసరమైతే మళ్లీ త్యాగం చేసి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొస్తా అన్నారు. గతంలో నేను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల వద్దకు వచ్చిందని.. అవసరమైతే మళ్లీ అంత దూరం వెళ్తానన్నారు. త్యాగమైనా, పోరాటమైనా మునుగోడు ప్రజల కోసమేన్నారు.
READ MORE: Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు
“నేను ఎదన్న మాట్లాడితే మంత్రి రాలేదని ఇలా మాట్లాడుతున్నా అంటున్నారు.. ఎల్‌బీనగర్‌లో పోటీ చేస్తే నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. నాకు వద్దు మునుగోడు ప్రజలే కావాలని ఇక్కడికి వచ్చాను. నాకు మంత్రి పదవి కావాలా? మునుగోడు ప్రజలు కావాలా? అంటే మునుగోడు ప్రజలే కావాలని చెప్పాను. పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటోడికి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది. అందరిలాగా పదవుల్లోకి పోయి పైరవీలు చేసి దోచుకునే వ్యక్తిని కాదు. వేల కోట్లు దోచుకునేటోళ్లకి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. మీరు పదవి ఇస్తా అని హామీ ఇచ్చారు. ఇస్తారా? లేదా? అనేది మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఎవడి ఇంటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నా వెంట ప్రజలు ఉన్నారు. నాకు కావాల్సింది ప్రజలే..” అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.