Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో హత్య ఘటన వెలుగు చూసింది. దుండగులు ఆటోలో వచ్చి విచక్షణ రహితంగా చంపారు. గుడ్ విల్ హోటల్లో చాయ్ తాగుతున్న సమయంలో ఓ వ్యక్తి పై దాడి చేశారు. చనిపోయిన వ్యక్తి నీ మహబూబ్ గా గుర్తించారు. కత్తులు, కొబ్బరి బొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. హత్యాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
READ MORE: CM Chandrababu: పీ4పై సీఎం కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రచారంపై క్లారిటీ..
నలుగురు వ్యక్తులు గొడవపడి ఓ వ్యక్తి నీ హత్య చేసినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.. హత్యకేసుకు సంబంధించి వివరాలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి హోటల్లో ఉన్న ముషీరాబాద్ కు చెందిన రౌడీషీటర్ ఏం. డి మహబూబ్ (35)ను కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారని తమకు సమాచారం అందిందని అన్నారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఎండి మహబూబ్ రౌడీ షీటర్ అని అతని పైన ఇప్పటికే 13 కేసులు ఉన్నాయని అందులో ఎక్కువగా దొంగతనం కేసులతోపాటు పఠాన్ చెరువు లో హత్య కేసులో సైతం నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నామన్నారు.
READ MORE: Chiranjeevi : చిరంజీవి మధ్యవర్తిత్వం.. రేపు కార్మికులతో సమావేశం?