మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
పంజాబ్‌లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. చండీగఢ్ రాజధాని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (GMCH)లో ఈ రోజు ఉదయం 35 ఏళ్ల రోగి మృత్యువాత పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో లూథియానాలోని సమ్రాలా నుంచి చండీగఢ్‌కు రిఫర్ చేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రోగికి ఇప్పటికే కాలేయంలో గడ్డ ఉందని, ఇతర వ్యాధులతో (కొమొర్బిడ్ పరిస్థితులు) బాధపడ్డాడు. ఒకటి కంటే ఎక్కువ రోగాలు చుట్టుముట్టడంతో అతని పరిస్థితి విషమించింది.
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్మైన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, రేడియోల్లో రోజూ వినిపిస్తూనే ఉంటుంది. మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా? మన దేశంలో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది సాయంత్రం కాగానే మద్యం బాటిల్ ఎత్తేస్తారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా పురుషులు సాధారణంగా స్త్రీల కంటే ఎత్తుగా ఉంటారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ భౌతిక వ్యత్యాసం వెనుక ఓ ప్రధాన జన్యుపరమైన కారణాన్ని కనుగొన్నారు. పెన్సిల్వేనియాలోని గీసింగర్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చిన బృందం మూడు పెద్ద ఆరోగ్య డేటాబేస్లను అధ్యయనం చేసింది.
కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.
నేపాల్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో ఓ వివాహ వేడుకకు సంబంధించినది. ఆహ్వానం లేని అతిథి వివాహానికి వచ్చారు. ఇందులో ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా జరిగేదే కాదా? అనుకుంటున్నారు కదా..