కొన్నిసార్లు మనం లోతైన ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు లేదా ఆందోళన, భయంతో చుట్టుముట్టబడినప్పుడు.. మన హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా మందికి సంభవిస్తుంది. సాధారణంగా ఓ వ్యక్తి హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ (BPM) ఉంటుంది. కానీ హృదయ స్పందన రేటు 100 BPM కంటే ఎక్కువగా ఉంటే.. దానిని 'టాచీకార్డియా' అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఏదైనా వ్యాధికి సంకేతమా? అనే విషయాలను తెలుసుకుందాం..
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు కాలం కంటే వేగంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఆఫీసు, ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి వివిధ రకాల బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రభావం చేసే పనిపై ఎక్కువగా పడుతూ.. మానసిక ఆందోళనకు కారణమవుతోంది. కొన్ని సార్లు ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, అనుకున్నది పూర్తి చేయలేకపోవడం లాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే.. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారాయి. మంచి భవనాలు, రంగురంగుల బొమ్మలతో గోడలు, అత్యాధునిక వసతులతో క్లాస్ రూమ్‌లు, నాణ్యమైన విద్యాబోధన, పైగా ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశ పెట్టారు.
పిల్లలు అల్లరి చేయడం కామన్. ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. కొంత మంది మాత్రం అస్సలు భరించలేరు. చిన్న పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తల్లి దారుణానికి ఒడిగట్టింది.
వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇక ఎప్పటిలాగానే బడి గంటలు మోగుతున్నాయి. సెలవుల్లో హాయి గా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్తున్నారు. ఇప్పటికే పిల్లలు, తల్లిదండ్రులు ఈ విద్యా ఏడాదికి సంబంధించిన స్టేషనరీ, బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు తదితర సామగ్రి కొనుగోళ్లతో నగరంలోని స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే.. పాఠశాలకు వెళ్తున్న మీ పిల్లలకు బ్యాగులు, పుస్తకాల వంటి సామగ్రితో పాటు కొన్ని అంశాలపై అవగాహన కొన్నింటికి దూరం చేయడం […]
భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ ఒకటి. చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి.
భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మనం పోషించే బైక్స్ కాకుండా మనల్ని పోషించే బైక్స్ గురించి తెలుసుకుందాం..
భర్త దౌర్జన్యకాండతో విసిగి పోయానని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేశాడని, తనను రక్షించాలని ప్రాథేయపడుతూ ఈనెల ఎనిమిదో తేదీన పూర్ణానందం పేటకి చెందిన ఓ బాధితురాలు 112 కి ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న 112 సిబ్బంది, సమాచారం సేకరించి సత్యనారాయణపురం నుంచి ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు సంఘటన స్థలానికి పంపింది. బాధితురాలు తన ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన తీరును పోలీసులకు క్షుణ్ణంగా వివరించింది. తనను రక్షించాలని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆ మహిళ ఆవేదన…
మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. హోండా CBR650R E-క్లచ్ బెస్ట్ కావొచ్చు! తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను మే నెలలో లాంచ్ చేశారు. దీనిని ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.40 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం..
కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద దోచుకుని లోకల్ జీఎస్టీ వేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి మద్యం బాటిల్ మీద రూ.10 అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధనపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు.