హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమిచ్చాడు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే చేశామని, ఈసారి మహాగణపతిని దర్శించుకునే భక్తులకు అన్ని విఘ్నాలు తొలగిపోవడంతో పాటు విశ్వశాంతి నెలకొనేందుకే విశ్వశాంతి మహా గణపతిగా నామకరణం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా.. సోమవారం మహాగణపతికి ఆగమన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా మరాఠా బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు, తలపాగాలు ధరించి బ్యాండ్ వాయిస్తూ మహాగణపతి ఆగమనానికి స్వాగతం పలికారు. అయితే.. ఖైరతాబాద్ వినాయకుడిని 71 ఏళ్ల చరిత్ర ఉంది.
READ MORE: AP Bar License: ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు..
1893లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొన్నారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 1954లో ఖైరతాబాద్‌కు చేరింది. ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణేషుడు ప్రారంభమయ్యాడు. 2014లో 60 అడుగుల ఎత్తుతో షష్టి పూర్తి మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు.
READ MORE: ఈ టీవీ ధరకు SVU కారు కొనొచ్చు కాదయ్యా.. Hisense UX ULED సిరీస్ టీవీలు లాంచ్!
హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రాంతంలో 1954లో 1 అడుగుల (0.30 మీ) ఎత్తైన గణేశుడి విగ్రహం స్థాపించారు. బాలగంగాధర తిలక్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన భారత స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త, మాజీ కార్పొరేటర్ అయిన సింగరి శంకరయ్య ఈ పండుగను ఐక్యతకు గుర్తుగా జరుపుకోవాలని ప్రారంభించారు. ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 71వ సంవత్సరం కావడంతో 69 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు… ఖైరతాబాద్ గణేషుడు.. కొన్నాళ్ళు లడ్డూ నైవెద్యంలో కూడా అందరి దృష్టిని ఆకర్శించాడు. అయితే లడ్డూ పంపిణిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో… ఆ ఆచారాన్ని నిలిపివేశారు. ఖైరతాబాద్ గణేష్ చేతిలో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది. ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.