ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి.. ఇల్లీగల్‌గా ఉన్న బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ కొంత మంది మాత్రం అలాంటి నిషేధిత యాప్‌లు నిర్వహిస్తూ.. జనాల వద్ద అందినకాడికి దోచుకుంటున్నారు. అలాంటి 8 మంది ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి.. అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్తవానికి.. ఖేల్ గేమ్ , ఖేల్ స్టార్ , ఖేలో 24 , ఖేలో ఎక్చేంజ్, ఖేలో స్పోర్ట్, విన్ మ్యాచ్.. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉంది. కానీ వీటిని కూడా కొంత మంది అడ్డదారిలో తీసుకువచ్చారు.
READ MORE: Protest: మాకు చలానా వేస్తారు కదా..? ఇప్పుడు నాకు ఫైన్ కట్టండి..
నిషేధిత యాప్స్‌ను వీరు మారు వ్యక్తుల పేర్లతో యూజర్ ఐడీలు క్రియేట్ చేశారు. బ్యాంక్ ఖాతాలను సృష్టించారు. జోరుగా దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయం కాస్తా పోలీసులకు సమాచారం అందడంతో వారిని అరెస్ట్ చేశారు. నిందితులను జి. వినయ్ కుమార్, ఎన్. సాయి వర్ధన్ గౌడ్, డి. రాహుల్, డి. జెశ్వంత్ తేజ, వేణు గోపాల్, కె. రామ్, వేల్పుల ఆకాష్, డి. ప్రణయ్‌గా గుర్తించారు. మరో ఇద్దరు కీలక నిందితులు కరీంనగర్‌కు చెందిన రాజేష్, అస్లాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. బెట్టింగ్ రాకెట్‌ను నడపడానికి ఈ ముఠా ఏకంగా 235 యూజర్ ఐడీలను జనరేట్ చేసి, కమిషన్ ప్రాతిపదికన యువతను వలలో వేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ సౌత్‌జోన్, ఎస్.ఆర్.నగర్ పోలీసుల సంయుక్తంగా చేసిన ఈ దాడిలో నిందితుల నుంచి 18 మొబైల్ ఫోన్లు, 3 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 13 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. రూ. 29,81,000 విలువైన ఆన్‌లైన్ లావాదేవీలను స్తంభింపజేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
READ MORE: Chennai Drugs: చాక్లెట్ల మాటున డ్రగ్స్ దందా.. దాని విలువ రూ. 100 కోట్లు..
మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని యువత ఉసురు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల – శ్రీశైలం నల్లమల అడవి ప్రాంతంలోని చిన్నారుట్ల సమీపంలో చెట్లపొదల్లో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించారు. రహదారి దూరం ఉండడంతో మృతదేహం రాళ్ల గుట్టలు దట్టమైన అటవీప్రాంతంలో ఉండడంతో పోలీసులు మృతదేహాన్ని ఎత్తుకొని సుమారు 3 కిలోమీటర్ల దూరం నడిచి రహదారిపై ఉన్న ఆటోలో ఎక్కించి పోస్టుమార్టంకి పంపించారు. మృతి చెందిన యువకుడిని హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలానికి చెందిన ముక్కెర సాయి కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్, చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసి ఆగస్టు 25న హైదరాబాద్ బండ్లగూడ నుంచి ఇంట్లో చెప్పకుండా వచ్చాడని.. అక్కడ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిపారు. ప్రజలు బెట్టింగ్ యాప్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. డబ్బు మీద అత్యాశతో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పెట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు..