అతను ఎం.టెక్ వరకు చదివాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ చెడు వ్యక్తులతో స్నేహం చేసి జూదానికి బానిసయ్యాడు. ఆపై దొంగతనం చేసి ఇప్పుడు జైలుకు వెళ్లాడు. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శీతల్ చింతల్వార్ ఇంట్లో దొంగతనం జరిగింది.
ప్రస్తుతం కాలంలో ఎక్కువ రోజులు బతకడం కష్టం. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది 60-70 మధ్యలోనే మరణిస్తున్నారు. మరి కొందరు రోగాలు, ప్రమాదాలు సంభవించి మధ్యలోనే మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా వృద్ధ తల్లి, కుమార్తెల అసమాన ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఎంపీ శశి థరూర్‌కు సొంత పార్టీ కాంగ్రెస్‌తో విభేధాలు ఉన్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల.. అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వం శశి థరూర్‌ను నాయకుడిగా నియమించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ శశి థరూర్ పేరును ప్రతిపాదించలేదు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ఎక్స్'లో "లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను" అని రాశారు.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుని హత్య కలకలం సృష్టించింది. చందానగర్ లోని గిడ్డంగి కల్లు కంపౌడ్ లో యువకుడిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నలుగురు మిత్రులు కళ్ళు కాంపౌండ్‌లో కళ్ళు తాగడానికి వచ్చారు. అమ్రేష్ అనే యువకుడిని అతని ముగ్గురు స్నేహితులు కలిసి చంపేశారు. ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగింది.
ఏపీ సీఎం చంద్రబాబుకి టీజీ సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచన చేశారు. మోడీ మీరు చెప్తే వినొచ్చు.. కానీ మా ప్రయోజనాలు వదులుకోలేమని రేవంత్‌రెడ్డి అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంపై సీఎం రేవంత్ మాట్లాడారు. మా హక్కులు హరిస్తే న్యాయ స్థానాలు ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. మిగులు జలాలు 3 వేల టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి అనుకుంటే.. మా 968 టీఎంసీల వాటా వాడుకునేందుకు క్లియర్ చేయాలని సూచించారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల మీకు నీళ్ళు వస్తున్నాయని ఆరోపించారు.
కేసీఆర్, జగన్ ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్న కేసీఆర్ మాటలను గుర్తు చేశారు. తాజాగా ప్రాజెక్టుల అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో సీఎం మాట్లాడారు. గోదావరి జలాలు పెన్నాకు తీసుకెళ్తా అని చెప్పి.. ఏపీని ప్రోత్సహిస్తాం అని చెప్పింది కేసీఆర్ అని తెలిపారు.
ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ నెల 16న ఏసీబీ ఇచ్చిన నోటీసుపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ లేఖ ద్వారా ఏసీబీ కి సమాధానం పంపించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 13న మీరు పంపిన లేఖ మేరకు 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ ప్రశ్నించింది. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అనిల్ కుమార్, హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఐపీఎస్ జితేంద్ర పని చేశారు. జితేందర్, అనిల్ కుమార్ దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది.
ప్రియుడు కోసం పెళ్లి మండపంలో ప్రియురాలు దొంగతనం చేసింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి లో ఘటన చోటు చేసుకుంది.. ప్రియుడి అవసరాల కోసం ఓ పెళ్లి మండపంలో 21 సవరాల నగలను ప్రియురాలు జ్యోతి దొంగతనం చేసింది.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ప్రియుడు, ప్రియురాలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడు అప్పును తీర్చడానికి, జల్సాల కోసం దొంగతనం చేసినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.