మహారాష్ట్ర షోలాపూర్ నగరంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శిక్షణ కేంద్రంలోని దాదాపు 170 మంది ట్రైనీ పోలీసులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కేంద్రంలో తయారుచేసిన ఆహారం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు. బాధిత ట్రైనీ పోలీసులందరినీ వెంటనే షోలాపూర్‌లోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది. వారిలో దాదాపు 15 మందికి సెలైన్ ఇచ్చి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. 170 మందికి పైగా పోలీసులు అస్వస్థతకు గురయ్యారు.
READ MORE: Luxury Ship: ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోయిన లగ్జరీ నౌక.. వీడియో వైరల్
షోలాపూర్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ప్రస్తుతం దాదాపు 1350 మంది ట్రైనీ పోలీసులు శిక్షణ పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం సెషన్‌లో శిక్షణార్థులు అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలు, వికారంతో అవస్థలు పడ్డారు. 170 మందికి పైగా పోలీసులు ఒకరి తర్వాత ఒకరు అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చాలా మంది పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సంఘటన శిక్షణా కేంద్రంలో భయాందోళనలను సృష్టించింది. ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: లెవెల్ 2 ADAS, పానోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియమ్ ఫీచర్లతో కొత్త Hyundai Creta EV లాంచ్! ధర ఎంతంటే?