అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక్క వ్యక్తి తప్ప ఎవరూ బయటపడలేదు. విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం. తాజాగా ఆయనకు సంబంధించి ఓ సమాచారం వెలువడింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే, విశ్వాస్ తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ వీడియో కాల్ గురించి అతని మరో సోదరుడు తెలిపారు. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే విశ్వాస్ తన తండ్రికి ఫోన్ చేసి తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.
చిన్న చిన్న అవసరాలకు బ్యాంకు నుంచి రుణం తీసుకునే బదులు స్నేహితులను సంప్రదించడం బెటర్. ఇలా మిత్రుడితో డబ్బులు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి అనేక రకాల పత్రాలు అవసరం. వ్యక్తిగత రుణాలపై భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీకు అత్యవసరం ఉన్నప్పటికీ కొన్ని సార్లు బ్యాంకుల్లో సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. దీంతో అధిక సమయం ఎదురు చూడాల్సి వస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్‌లోని పాంటా సాహిబ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక్కడ ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయితో పారిపోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులతో సహా 10 మంది గాయపడ్డారు. ఈ అంశంపై పాంట సాహిబ్ పట్టణంలో హిందూ సంస్థలు 4 రోజులుగా నిరసన తెలుపుతున్నాయి. వారు దీనిని లవ్ జిహాద్ కేసుగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ముస్లిం యువకుడితో పారిపోయిన అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు.
అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదం అనంతరం భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో ఎయిర్ ఇండియా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు ఈ విమానయాన సంస్థను ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? అసలు దీని చరిత్ర ఏంటి? అనే విషయాల గురించి పూర్తిగా…
ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్లోని 20 మందికిపైగా వైద్య విద్యార్థులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్ స్పందించాడు.
థాయిలాండ్ గాయకుడు రువాంగ్‌సక్ లాయ్‌చూజాక్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఓ షాకింగ్ కథను పంచుకున్నారు. 1998లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 101 మంది మరణించిన తాను మాత్రం బయటపడ్డానని వెల్లడించారు. ఆ సమయంలో తాను సీటు నంబర్ 11Aలో కూర్చున్నట్లు తెలిపారు. ఆశ్యర్యం ఏంటంటే..