Mojtaba Khamenei: క్షణాల తేడాతో మృత్యువును జయించిన మొజ్తబా ఖమేనీ..
- క్షిపణి దాడి నుంచి తృటిలో బయటపడిన మొజ్తబా ఖమేనీ..
- యూఎస్-ఇజ్రాయిల్ దాడి సమయంలో భవనం బయట ఉన్న ఖమేనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mojtaba Khamenei: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా జరుపుతున్న యుద్ధంలో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి28న టెహ్రాన్‌పై జరిగిన వైమానిక దాడిలో అప్పటి సుప్రీం లీడర్, మొజ్తబా ఖమేనీ తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అయితే, అదే సమయంలో దాడి జరిగిన ప్రాంతానికి బయట ఉండటంతో మొజ్తబా ప్రాణాలు దక్కాయని తెలుస్తోంది.కొన్ని సెకన్ల వ్యవధిలోనే అతను మృత్యువు నుండి దూరమయ్యాడు. అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన క్షిపణి దాడిలో అలీ ఖమేనీ, అతడి కుటుంబ సభ్యులు మరణించారు.
Read Also: Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్
Also Read
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. దాడి జరగడానికి కొద్ది క్షణాల ముందే మొజ్తబా ఖమేనీ తన భవనం నుంచి బయటకు వెళ్లాడని తెలిసింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే క్షిపణి ఆ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక అధికారులు మొహమ్మద్ షిరాజీ కూడా మరణించినట్లు నివేదిక చెబుతోంది. ఈ దాడి కారణంగా భారీ విధ్వంసం జరిగినట్లు ఆడియో లీక్ వల్ల తెలిసింది. “మొజ్తబా ఏదో పని మీద ఆవరణలోకి వెళ్లి, ఆ తర్వాత తిరిగి రావడమే దైవ సంకల్పం,” అని ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ అధిపతి మజాహెర్ హొస్సేనీ, ఇరాన్ అధికారులతో ఒక ప్రైవేట్ సమావేశంలో చెప్పినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది.
ఈ దాడిలో ఒక క్షిపణి అలీ ఖమేనీ ఉన్న భవనాన్ని తాకగా, మరొకటి పై అంతస్తులో ఉన్న మొజ్తబా నివాసాన్ని తాకినట్లు నివేదిక పేర్కొంది. ఆ ప్రాంగణంలోని మొజ్తబా బావమరిది మిస్బా అల్-హుదా బఘేరి కనీ నివాసంపై మరో క్షిపణి దాడి చేసిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ క్షిపణి దాడిలో డెడ్ బాడీలు కూడా గుర్తించలేని విధంగా తయారైనట్లు చెప్పింది. మరోవైపు, దాడి వల్ల మొజ్తబా కోమాలో ఉన్నారని, అతడి కాలు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి