వినాయక చతుర్థి వచ్చేసింది. భక్తులంతా వినాయకుని ప్రతిమలను మండపాల్లో పెట్టి కొలుస్తున్నారు. అయితే.. మనమంతా పెట్టుకునే ఈ గణేశుడి విగ్రహాల ఖర్చు, రంగు, రూపం భిన్నంగా ఉండాలని అందరూ అనుకుంటారు. వారి అభిరుచులకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేయించుకుంటారు. చాలా రకాల వినాయకుడి ప్రతిమలు చూసే ఉంటారు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే 5 స్టార్ చాక్లెట్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా? చూడలేదా.. అలాగైతే.. ఏపీలోని అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే.
READ MORE: Helicopter Crash: షాకింగ్ సీన్.. నీరు నింపే ప్రయత్నంలో బొక్క బోర్ల పడ్డ హెలికాప్టర్.. వైరల్ వీడియో
అనంతపురం జిల్లా తాడిపత్రి లోని వినాయక కాంప్లెక్స్ లో 10 రూపాయల 5స్టార్ చాక్లెట్‌లతో వినాయక ప్రతిమ తయారు చేశారు. లక్ష రూపాయలు ఖర్చు చేసి ఏకంగా 5 వేల చాక్లెట్లులతో వెరైటీ లంబోధరుడిని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని చూసి చిన్నపిల్లలు ఎంతో ఆకర్శితులవుతున్నారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు. ఆ రోజు చాక్లెట్ల పంపిణీ చేపడితే పిల్లలకు పండగే. కాగా.. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో గణపతి ప్రతిమలను ప్రత్యేకంగా అలకరించారు.
READ MORE: Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!