బండ్ల గూడలో డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబల్ బెడ్ రూమ్ సూపర్ వైజర్‌తో కుమ్మక్కైన మోసగాళ్లు ప్లాట్ బాధితులకు చూపించారు. 40 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికేట్లు తయారు చేసి డబల్ బెడ్ రూమ్ మంజూరు అయినట్లు సర్టిఫికేట్ క్రియేట్ చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో శ్రమ్ శక్తి భవన్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది.
రైతు భారోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతుభరోసా కోసం మరో రూ.1313.53 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ చేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని విమర్శించారు.
ఆ వ్యక్తి వయసుల 70 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఈ వయసులో దుర్భుద్ధి ప్రవేశపెట్టాడు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 38.73లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్‌లో ఇరికించి రూ. 38.73లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈవో డా, జైతీర్థ్ ఆర్. జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్డీఎల్ డైరెక్టర్ జీ.ఏ. శ్రీనివాస మూర్తి, తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని సీఎం కోరారు. హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని రేవంత్ వివరించారు.
బంగ్లాదేశ్ చొరబాటుదారులపై భారత్ నిరంతరం కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ అక్కడక్కడా చొరబాటు దారులు భయటపడుతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బంగ్లాదేశ్ చొరబాటుదారుడి ఆచూకీ బయటపడింది. బంగ్లాదేశ్ పౌరుడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. నిందితుడి వద్ద ఓటరు, పాన్, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి.
జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 'మహా రోజ్గర్ మేళా' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 కి పైగా కంపెనీలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు. ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం .
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. సదరు విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గోపాల్పూర్ బీచ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రారంభంలో ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.