-
Falcon Scam: రూ.850 కోట్ల ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ
Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి లభించింది. భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ను తెలంగాణ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి వచ్చిన అమర్‌దీప్‌ను అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్‌దీప్‌పై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసి) జారీ చేయడంతో, అతడు భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు రూ.850 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి… -
Narayanpet: హృదయ విదారక ఘటన.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ తండ్రి..
Narayanpet: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్న పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. తీలేరు గ్రామానికి చెందిన శివరాం తన ఇద్దరు పిల్లలు రిత్విక (8), చైతన్య (5)లను కోయిల్ సాగర్ కెనాల్లోకి తోసివేసి హత్య చేశాడు. కెనాల్లో పడిన ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం శివరాం కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు గుర్తించి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం… -
Cyberabad Police: ఈత.. కారాదు కడుపు కోత! పేరెంట్స్‌కి పోలీసులు కీలక సూచనలు..
Cyberabad Police: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. చిన్న పాటి నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారన్నారు.. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు కీలక సూచనలు చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
Pakistan: పాకిస్థాన్‌లోని జలాశయాల్లో “విదేశీ ఫిష్”.. అల్లాడుతున్న పాక్ చేపలు..
Pakistan: పాకిస్థాన్‌లోని సింధ్, లోయర్ పంజాబ్ ప్రాంతాల జలాశయాల్లో ప్రమాదకరమైన విదేశీ చేపలు వేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూవీడబ్ల్యూఎఫ్–పాకిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చేప కారణంగా జలజీవ వైవిధ్యం, మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించింది. జనవరి 4న విడుదల చేసిన ప్రకటనలో.. సుక్కూర్ సమీపంలోని ఓ జలాశయం నుంచి కరాచీ ఫిష్ హార్బర్‌కు తీసుకొచ్చారు. ఈ వింత చేపపై తొలుత ఎవరికీ స్పష్టత లేదని తెలిపింది. దాన్ని చూసినవారు "గ్రహాంతర"గా అభివర్ణిస్తున్నారు. ఉన్నతాధికారుల పరిశీలనలో అది అమెజాన్ సైల్ఫిన్ క్యాట్‌ఫిష్‌గా గుర్తించినట్లు… -
India: వెనిజువెలాపై అమెరికా దాడులు.. భారత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ఆ దేశానికే మద్దతు
India: వెనిజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు జనవరి 4, 2026న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. వెనిజువెలా ప్రజల భద్రత, సంక్షేమానికి భారత్ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేసింది. సమస్యలను శాంతియుతంగా, సంభాషణల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చింది. వెనిజువెలాలో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే కారకాస్‌లోని భారత రాయబారం అక్కడ ఉన్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని… -
Asaduddin Owaisi: భారత్ కూడా అమెరికా వెనిజువెలాను చేసినట్లు చేయాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
Asaduddin Owaisi: వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా సైన్యం సొంత దేశంలోనే పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహాలో 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులను కూడా భారత్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కారకాస్‌లో జరిగిన అమెరికా సైనిక దాడిలో మడురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించిన సంగతి తెలిసిందే. డ్రగ్ ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో ఆయనపై విచారణ జరగనుంది. -
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి.. పాముతో పోలీసులను భయపెట్టిన ఆటో డ్రైవర్
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఓ ఆటోను ఆపారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో డ్రైవర్‌కు 150 రీడింగ్ రావడంతో పోలీసులు ఆటోను సీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసి ట్రాఫిక్ పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. -
Harish Rao: కాళేశ్వరంపై కక్షగట్టారు, పాలమూరుపై పగబట్టారు..
Harish Rao: ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాజకీయాల కోసం కాదు.. ఇది పూర్తి నిబద్ధతతో, సాక్ష్యాధారాలతో చూపిస్తున్న పీపీటీ అని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.. కుట్రపూరితంగా ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా చేస్తున్నారన్నారు. కాళేశ్వరంపై కక్షగట్టారు, పాలమూరుపై పగబట్టారని ఆరోపించారు.. 2004-14 వరకు కాంగ్రెస్ పాలనలో 6. 64 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు ఇచ్చారన్నారు.… -
KTR: నాకు నాలుగు భాషల్లో తిట్లువచ్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ కౌంటర్..
KTR: కేసీఆర్, హరీష్‌రావులను ఉరి తీయాలంటూ సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్, అలా అయితే కాంగ్రెస్‌ను ఎన్ని సార్లు ఉరి తీయాలంటూ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగించారు. -
Zelensky: మడురో లాగా పుతిన్‌ను పట్టుకోవాలని ట్రంప్ ప్లాన్ చేస్తారా? జెలెన్స్కీ వ్యాఖ్యలకు అర్థమేంటి?
Zelensky: అమెరికా వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. నియంత పాలకులతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు తెలుసు అన్నట్టుగా జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు, పరోక్షంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరోపియన్ జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!