Jaish-e-Mohammed: పాకిస్థాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతోంది. పహల్గామ్ దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్థాన్‌లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా జైషే మహ్మద్ ఈ ప్రధాన కార్యాలయాన్ని మరోసారి పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ దీని కోసం ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించాడు. విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ కి 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్ చాలా కాలంగా…
NTV Podcast Promo: శ్రీను వైట్ల.. ఒకప్పుడు ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమా వచ్చిందంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ‘ఆగడు’ తర్వాత ఆయన జాతకం అడ్డం తిరిగింది. ఈ సినిమా అనంతరం వచ్చిన మూవీస్ అనుకున్న రీతిలో ఆడలేదు. అయితే.. శ్రీను వైట్లు తాజాగా పాడ్కాస్ట్విత్ ఎన్టీవీ(ntvPodcastShow)లో పాల్గొన్నారు.
భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుంకాల పెంపు అంశంపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాలు మన ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపవని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ షరతులు వర్తిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం…
హరీష్ మాటలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకనభావం.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదన్నారు.
రెండో భార్య కూతురు...!! వరుసకు కూతురవుతుందన్న సోయి లేదు. మైనర్ అమ్మాయి అనే జాలి లేదు. విచక్షణ మరిచి.. కామాందుడిలా ప్రవర్తించాడు. స్టార్ హీరోలకు స్టెప్పులు నేర్పిన కొరియోగ్రాఫరే ఐనా... తన నీచపు బుద్ధితో పరువు బజారుకీడ్చుకున్నాడు. కూతురిని వేధించడంతో తట్టుకోలేకపోయిన తల్లి.. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Hyderabad: హైదరాబాద్ సిటీలో నిఘా ఎక్కువైందని.. శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. డ్రగ్ పార్టీల కోసం ఫాం హౌజ్‌లు, రిసార్ట్లు అద్దెకు తీసుకుంటున్నారు. బర్త్ డే.. గెట్ టుగెదర్.. వీకెండ్ ఔటింగ్... అంటూ పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా 10 రోజుల వ్యవధిలోనే 2 డ్రగ్ పార్టీలపై దాడులు చేశారు పోలీసులు. యువకుల వద్ద పెద్ద ఎత్తున్న డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గబ్బు పట్టిస్తున్న పబ్బులపైనే ఫోకస్ పెట్టిన పోలీసులు..
ఓ భగ్న ప్రేమికురాలు తన వ్యక్తిగత సమస్యను.. జాతీయ సమస్యగా చేయాలని ప్రయత్నించింది. తనకున్న టెక్నాలజీ తెలివి తేటలను వాడుకుని పోలీసుల కళ్లను కూడా బురిడీ కొట్టింది. చివరికి చిన్న మిస్టేక్‌తో దొరికిపోయింది. ఇంతకీ ఆ కిలాడీ లేడీ ఎవరు? ఏం చేసింది? కొద్ది రోజుల కింద దేశవ్యాప్తంగా విమానాశ్రాయలకు, కార్పోరేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి గుర్తుందా..? అది ఉగ్రవాదుల పని అయి ఉంటుందని పోలీసులు, నిఘా సంస్థలు అనుమానించాయి. ఆ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేశాయి. చివరకు…
Chain Snatching: చైన్ స్నాచింగ్ గ్యాంగుల బెడద ఎక్కువైంది. బైక్ మీద వెళ్తూనే మహిళల మెడల్లో బంగారు గొలుసులు ఎత్తుకెళ్తున్నారు. కానీ ఈ మధ్య కారులో కూడా చైన్ స్నాచర్లు వస్తున్నారని వెల్లడైంది. అలా వచ్చిన కర్ణాటక గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ కొట్టేశారు స్నాచర్లు.
Samarlakota Triple Murder: కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణంగా తెలుస్తోంది. నిందితుడు సురేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అసలు సంబంధం లేని చిన్నారులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సామర్లకోట సీతారామ కాలనీలో తల్లి మాధురి, కూతుర్లు పుష్ప కుమారి, జెస్సీలను అతి కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో భర్త లేని సమయంలో ఈ దారుణం జరిగింది.. దానికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు
సరోగసీ ముసుగులో డాక్టర్ నమ్రత చేసిన రోత పనులు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరించుకుని.. ఒక డాక్టర్‌గా చేయకూడని పనులే చేసింది డాక్టర్ నమ్రత. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే నీచపు గ్యాంగులతో చేతులు కలిపింది. తుచ్ఛమైన డబ్బు కోసం డాక్టర్ నమ్రత చేయని పని లేదంటే.. అతిశయోక్తి కాదు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేసిన డాక్టర్ నమ్రత.. తన నీచపు పనుల కోసం దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించుకుంది. దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల నుంచి సృష్టి అక్రమ…