కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- MG Cyberster Couture Edition, MG M9 Couture Edition లాంచ్..
- ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తాతో కలిసి రూపొందించిన ప్రత్యేక ఎడిషన్లు.
- ప్రతి మోడల్‌కు కేవలం 50 యూనిట్లు మాత్రమే అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Cyberster, M9 Couture Edition: JSW ఎంజి మోటార్ ఇండియా (JSW MG Motor India) భారత మార్కెట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లైన MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ (MG Cyberster Couture Edition), MG M9 కౌచర్ ఎడిషన్ (MG M9 Couture Edition) ప్రత్యేక ఎడిషన్లను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా (Gaurav Gupta)తో కలిసి రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు ప్రత్యేక డిజైన్, లగ్జరీ ఫినిష్‌తో రూపుదిద్దుకున్నాయి. అయితే ప్రతి మోడల్‌కు కేవలం 50 కార్లు మాత్రమే అమ్మబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ధరలు:
MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ ధర రూ.87.49 లక్షలు, MG M9 కౌచర్ ఎడిషన్ ధర రూ.84.94 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లు తమ స్టాండర్డ్ వేరియంట్ల కంటే రూ.4.99 లక్షలు అధిక ధరతో వీటిని అందుబాటులోకి వచ్చాయి. జూలై 20 నుంచే బుకింగ్‌లు ప్రారంభం కాగా.. ఈ కార్ల డెలివరీలు ఆగస్టు 10 నుంచి మొదలు కానున్నాయి. వీటిని దేశంలోని 14 నగరాల్లో ఉన్న “MG సెలెక్ట్” ప్రీమియం షోరూమ్‌ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు.
Also Read
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్:
ఈ MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ లో తెలుపు రంగును బేస్‌గా తీసుకుని బాడీపై ఆకర్షణీయమైన ఆరెంజ్ స్ట్రీక్స్ పొందుపరిచారు. బోనెట్‌పై సర్పెంట్ ఇన్ఫినిటీ బ్యాడ్జ్‌లు, టోనో కవర్‌పై ప్రత్యేక ఎంబ్రాయిడరీ, ముందు-వెనుక భాగాల్లో గోల్డ్ ఫినిష్ MG లోగోలు ఈ ఎడిషన్‌కు ప్రత్యేక గుర్తింపును అందిస్తున్నాయి.
MG M9 కౌచర్ ఎడిషన్:
ఈ MG M9 కౌచర్ ఎడిషన్‌లో కూడా తెలుపు రంగుతో పాటు చార్కోల్ కలర్ స్ట్రీక్స్ అందించారు. ముందు బంపర్‌పై సర్పెంట్ ఇన్ఫినిటీ (Serpent Infinity) బ్యాడ్జ్, MG లోగోకు ఇరువైపులా పౌరాణిక రెక్కలున్న పాంథర్ ఆకారంలోని బ్రోచెస్ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇంటీరియర్‌లో డ్యాష్‌బోర్డ్‌పై కౌచర్ ఎడిషన్ (Couture Edition) బ్రాండింగ్‌ను అందించారు. మిగతా క్యాబిన్ డిజైన్ మాత్రం స్టాండర్డ్ M9 మోడల్లాగే ఉంటుంది.
ఈ ప్రత్యేక ఎడిషన్లలో డిజైన్ పరంగా మాత్రమే మార్పులు చేశారు. మెకానికల్ స్పెసిఫికేషన్లు మాత్రం స్టాండర్డ్ మోడల్లాగే కొనసాగుతున్నాయి. MGసైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్‌లో 77kWh బ్యాటరీ ప్యాక్‌తో డ్యూయల్ మోటార్ AWD సిస్టమ్ ఉంటుంది. ఇది 510bhp పవర్, 725Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 580 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. అదే కౌచర్ ఎడిషన్‌లో 90kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్ ఉంది. ఇది 245bhp పవర్, 350Nm టార్క్ అందిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 548 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?