Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karikala First Look: సందీప్ కిషన్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు పూర్తిస్థాయి అడ్వెంచర్ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు ఆయన చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కరికాల’ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సందీప్ కిషన్ ఫస్ట్ లుక్. ఓ శక్తివంతమైన యోధుడిగా చూపించిన ఈ విజువల్స్ ని చూస్తూ ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ సందీప్ ను చూడలేదని అభిమానులు సంబరపడుతున్నారు. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మిస్తున్నారు. ‘శంభల’ తర్వాత మరో భారీ ఫాంటసీ కథతో యుగంధర్ ముని ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. చందమామ కథలను గుర్తు చేసే మాయా ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో సందీప్ కిషన్ చేతిలో కత్తి పట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తారు. ఆయన పక్కనే గర్జిస్తున్న సింహం ఉండటం పోస్టర్‌కు మరింత గ్రాండియర్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమాలో పురాణ గాథలు, రాజ్యాలు, మాయా జీవులు, అతీంద్రియ శక్తులు కూడా ఉండనున్నట్లు పోస్టర్ ద్వారా సంకేతాలు ఇచ్చారు.
‘కరికాల’ పాత్ర సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యంత భిన్నమైన పాత్రగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక మేకోవర్‌తో సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ప్రేమకథలు, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో అలరించిన సందీప్ ఇప్పుడు పూర్తిగా విభిన్నమైన ఫాంటసీ యోధుడిగా మారడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫాంటసీ అడ్వెంచర్ ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. మొదటి భాగం 2027 జూలై 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుండగా, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేయనున్నారు. తక్కువ వ్యవధిలోనే రెండు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషంగా మారింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం కథానాయిక వివరాలతో పాటు మిగతా నటీనటుల వివరాలను గోప్యంగా ఉంచింది. త్వరలోనే పూర్తి తారాగణాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!