Putin to Visit India: అమెరికాతో ఉద్రిక్తత మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శిస్తారని, ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం మాస్కో పర్యటన సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనపై భారత్ ఎంతో ఉత్సాహం, ఆనందంగా ఉందని అజిత్ పేర్కొన్నారు. గత భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాలను ద్వైపాక్షిక సంబంధాలలో మార్పు క్షణాలుగా ఆయన అభివర్ణించారు.
Hyderabad: హైదరాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ఆధిపత్యం, పాతకక్షల నేపథ్యంలో ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎక్కడ హత్య జరుగుతుందో తెలియక సామాన్య జనం హడలి పోతున్నారు. హైదరాబాద్‌లో ఎల్లమ్మబండలో తాజాగా జరిగిన రౌడీషీటర్ హత్య కలకలం రేపుతోంది. ఎల్లమ్మబండలోని గుడ్ విల్ హోటల్లో మహబూబ్ అనే రౌడీ షీటర్ టీ తాగడానికి వచ్చాడు. అతని రాకపై సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు రంగంలోకి దిగారు. అప్పటికే మర్డర్ ప్లాన్ వేసిన ముగ్గురు నిందితులు ఆటోలో అక్కడి చేరుకున్నారు. రావడమే […]
Fake Doctor: చెప్పేవాడికి నమ్మేవాడు లోకువ. అందుకే ఏది పడితే అది చెప్పి నమ్మిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంత మంది అందిన కాడికి దోచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు ఇప్పుడు సమాజంలో ఎక్కువగానే తారసపడుతున్నారు. హైదరాబాద్‌లోనూ అలాంటి కిలాడీ వ్యక్తి ఒకడు చాలా రోజులుగా జనాలను చీటింగ్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి హాయిగా బతికేస్తున్నాడు. చివరకు పాపం పండి.. పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు..? ఎలా చిక్కాడు..?
Psychologist Rajitha Suicide: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందని సామెత. అంటే ఏదైనా బాగు చేయాలని కోరుకుంటే.. మొదటికే మోసం వచ్చిందని చెబుతుంటారు పెద్దలు. సరిగ్గా ఆమె విషయంలో కూడా అదే జరిగింది. ఓ మానసిక రోగిని బాగు చేద్దామని మంచి సంకల్పంతో.. అతనితో జీవితం కూడా పంచుకుంది. కానీ చివరకు అతడి చేష్టలు.. వేధింపుల కారణంతో తానే జీవితాన్ని త్యజించాల్సిన దుస్థితి ఏర్పడింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో భర్త వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న ఓ సైకాలజిస్ట్ కథ.. అందరినీ కంటతడి…
War 2 : జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్. అయితే సోషల్ మీడియా…
Jigis Movie Teaser: నలుగురు ఫ్రెండ్స్ వారి మధ్య చిన్న చిన్న గొడవలు సరదా పంచ్‌లు.. ఇలాంటి కథాంశాలతో వచ్చే సినిమాలు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడు ఉంటారు. దర్శకులు చేయాల్సిదల్లా రైటింగ్‌లో మ్యాజిక్ చూపించడమే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% యాడ్ చేశారు. 50% సుంకాలు పెంచుతూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. భారత్‌పై మొత్తం 50% సుంకాన్ని అమెరికా ప్రకటించింది.
మైనర్‌పై అత్యాచారం కేసులో ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అరెస్ట్‌పై స్టే విధించాలని యష్ రాజస్థాన్ హైకోర్టును సంప్రదించాడు. విచారణ జరిపిన కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో పాటు, ఆగస్టు 22న కేసు డైరీని సమర్పించాలని ప్రాసిక్యూషన్‌ను కోర్టు కోరింది. యష్ దయాల్ క్రిమినల్ పిటిషన్‌పై ప్రాథమిక విచారణను విచారిస్తూ జస్టిస్ సుదేష్ బన్సాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు మైనర్ కు సంబంధించినదని కోర్టు పేర్కొంది. ఇలాంటి…
Maharashtra Suicide: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా జిల్లాలోని పరాస్ గ్రామంలో ఒక యువకుడు తన అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సంఘపాల్ సిద్ధార్థ్ ఖండారే (30) గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు.. ఆ యువకుడు ఓ వీడియో రికార్డ్ చేసి తన సోదరుడికి పంపాడు. అందులో తన భార్య, బావమరిది, అత్తమామలు తనను కొట్టి, రూ.3 లక్షల అప్పు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించాడు.
India’s SuperGaming Raises: భారతీయ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ సూపర్‌గేమింగ్ తాజా రౌండ్ నిధులలో US $15 మిలియన్లను సేకరించింది. ఈ మొత్తాన్ని భారత కరెన్సీలోకి మారుస్తే, రూ.132 కోట్లు అవుతుంది. ఈ కంపెనీ మాస్క్గన్, ఇండస్ బాటిల్ రాయల్ వంటి భారతీయ షూటింగ్ గేమ్‌లను తయారు చేస్తుంది. రౌండ్ నిధులు అంటే.. సంస్థ లేదా స్టార్టప్ తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించే ప్రక్రియ.