కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. వచ్చే వారం ప్రధాన మంత్రితో సమావేశం అవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. మంత్రితోపాటు హాజరైన తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలు గా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని గడ్కరీని కోరారు. పలు రోడ్లు, భవనాలపై చర్చించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు... తాను ఏది మాట్లాడిన మంత్రి పదవి కోసమే అని ప్రచారం చేస్తున్నారన్నారు.. తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని.. పదవుల కోసం నేను ఎవరి కాళ్లు మొక్కనన్నారు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా.. అవసరమైతే మళ్లీ త్యాగం చేసి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొస్తా అన్నారు. గతంలో నేను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల వద్దకు వచ్చిందని.. అవసరమైతే మళ్లీ అంత దూరం వెళ్తానన్నారు. త్యాగమైనా, పోరాటమైనా…
Hyderabad Horror: హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో హత్య ఘటన వెలుగు చూసింది. దుండగులు ఆటోలో వచ్చి విచక్షణ రహితంగా చంపారు. గుడ్ విల్ హోటల్లో చాయ్ తాగుతున్న సమయంలో ఓ వ్యక్తి పై దాడి చేశారు. చనిపోయిన వ్యక్తి నీ మహబూబ్ గా గుర్తించారు. కత్తులు, కొబ్బరి బొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. హత్యాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Solapur Tragedy: డీజే ముందు డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ వేడుక ఊరేగింపులో డీజే ముందు నృత్యం చేస్తున్న యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. మృతుడిని 25 ఏళ్ల అభిషేక్ బిరాజ్దార్గా గుర్తించారు. నగరంలోని ఫౌజ్దార్ చావ్డి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. READ MORE: Chiranjeevi : చిరంజీవి మధ్యవర్తిత్వం.. రేపు కార్మికులతో సమావేశం? పోలీసుల సమాచారం ప్రకారం.. అభిషేక్ […]
మల్నాడు డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వ్యాపారవేత్త సందీప్ జువ్వాడితో పాటు సాఫ్ట్వేర్ ఇంజీనీర్ లోచన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ జువ్వాడి ఇంట్లోనే డ్రగ్ పార్టీలు జరిగినట్లు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని పార్టీలు నిర్వహించినట్లు తేలింది. మల్నాడు డ్రగ్స్ కేసులో ఏడు పబ్లకు నోటీసులు జారీ చేశారు. ప్రిజం పబ్, ఒకా పబ్, క్వాక్ పబ్, బ్రాడ్ వే, ఓక కోరా, క్వాక్ పబ్, పబ్బులకు నోటీసులు పంపారు.. డ్రగ్ పార్టీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పబ్బులు చేసినట్లు…
ఏం కష్టం వచ్చిందో.. ఏమో..! 18ఏళ్లు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అద్దె ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో అల్లం బాలరాజు (40) అనే బెటాలియన్ కానిస్టేబుల్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ములుగు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ బాలరాజు అద్దెకు ఉంటున్న ఇంటిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గంగారం 15వ బెటాలియన్ లో దాదాపు 18 ఏళ్లు కానిస్టేబుల్ గా విధులు నిర్వహించాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం…
Gachibowli: హైదరాబాద్లో నిన్న కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు గచ్చిబౌలిలో పిడుగు పడింది. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడింది. భారీ శబ్దం రావడంతో జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. పిడుగు ధాటికి తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫొటో చూశారా..? అచ్చం పోలీసు కానిస్టేబుల్ నిల్చొన్నట్టు పక్కనే పోలీసు కారు ఉన్నట్లు కనిపిస్తుంది కదూ.. నిజంగా అక్కడ కానిస్టేబుల్ నిలబడ్డారని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.. అక్కడ ఉన్నది నిజమైన పోలీసు కాదు.. అది నిజమై పోలీస్ కారూ కాదు.. ఇది ఓ కటౌట్ మాత్రమే.. జిల్లాలో జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టి , మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా జాతీయ రహదారి - 44 పై…
ప్రస్తుతం ఏ బిజినేస్ అయిన యువత ఇష్టాలమీద, ఉద్యోగుల అవసరాల మీద ఆధారపడి ఉంటున్నాయి. మీకు తెలుసా ఇప్పుడు మార్కెట్లో నయా లోన్ ట్రెండింగ్లో ఉందని.. అసలు ఏంటా నయా లోన్, దానిపై ఒక లుక్ ఏద్దాం.. మనం తరచుగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ గురించి వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు మార్కెట్లో నయా ట్రెండ్ నడుస్తుంది.
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు..