VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VVS Laxman to Replace Ajit Agarkar as BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ మారనున్నారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగుతున్న అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని బీసీసీఐ మరోసారి పొడిగించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఈ మేరకు పలు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అగార్కర్ స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్, మన తెలుగు ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం.
ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడం సహా రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు జోరుగా సాగిన సమయంలో అజిత్ అగార్కర్ స్పందించిన తీరుపై బీసీసీఐ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారట. ముఖ్యంగా రోహిత్ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయకుండా.. సందిగ్ధత కొనసాగేందుకు అవకాశం ఇచ్చారనే అభిప్రాయం బోర్డులో వ్యక్తమైనట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్‌లో అగార్కర్ పదవీకాలం ముగియగానే.. కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
- Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
- Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
- Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్ పేరు ముందంజలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్‌గా హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్ ఉన్న విషయం తెలిసిందే. భారత జట్టు మాజీ స్టార్ బ్యాటర్‌గా, అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీలో యువ ఆటగాళ్ల అభివృద్ధికి కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్‌కు భారత క్రికెట్ వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. దీంతో సెలక్షన్ కమిటీకి ఆయన నాయకత్వం వహిస్తే.. టీమిండియా భవిష్యత్ బాగుంటుందని బీసీసీఐ భావిస్తోందట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వాస్తవానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం 2026 జూన్‌తో ముగియాల్సి ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాంబ్వే సిరీస్‌ల నేపథ్యంలో అగార్కర్ పదవీకాలాన్ని బీసీసీఐ 3 నెలల పాటు పొడిగించింది. ఆ మూడు నెలల పదవీకాలం కూడా వచ్చే సెప్టెంబర్‌తో ముగుస్తుంది. అనంతరం అతడికి సాగనంపాలని బీసీసీఐ చూస్తోందట. కొన్ని నెలలుగా టీమిండియా వన్డే జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదాలు కూడా అగార్కర్ పదవికి ఎసరు పెట్టినట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!