Hyderabad Hit by Heavy Rain: హైదరాబాద్ సిటీలో పెనుగాలులతో కుండపోత వర్షం కురుస్తోంది.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, మాదపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిల్ మాల్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని…
Hyderabad High Court: హైకోర్టులో మరో లాయర్ ఒక్కసారిగా కుప్పకూలారు. కార్డియాక్ అరెస్ట్‌తో హైకోర్టు న్యాయవాది మృతి చెందారు. మృతుడిని ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన పరస అనంత నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. విధుల్లో భాగంగా నాగేశ్వరరావు నేడు హైదరాబాద్‌లోని హైకోర్టుకు వెళ్లారు.
CM Revanth Reddy: కేసీఆర్ అరెస్ట్ సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ అరెస్ట్ ఊహాగానాలకు తెరదించారు. కేసీఆర్ స్వీయ నియంత్రణలో బందీ అయ్యారని.. కొత్తగా ఆయన్ని జైల్లో పెట్టాల్సి అవసరం లేదన్నారు సీఎం రేవంత్. చర్లపల్లి జైలుకు ఫామ్‌హౌస్‌కు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్‌హౌస్‌లో పర్యవేక్షణ ఉంటుంది. జైల్లో పహారా ఉంటుందని చెప్పారు. కేసీఆర్‌ను ప్రజలు ఓడించడమే పెద్ద శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు.
Lara Williams: హైదరాబాద్‌లో కొత్త యుఎస్ కాన్సుల్ జనరల్‌గా లారా విలియమ్స్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యుఎస్ కాన్సుల్ జనరల్‌గా పనిచేయడం తనకు ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అంతటా యుఎస్-ఇండియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Trump Tariffs - Operation Sindoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరిపై అగ్రశ్రేణి నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్‌ను, అమెరికాకు ప్రథమ శత్రువుగా పరిగణించే చైనాను అకస్మాత్తుగా ట్రంప్ ఇష్టపడుతున్నారు. సుంకాల వివాదంలో చైనా కూడా భారతదేశానికి నైతిక మద్దతు ఇస్తుంటే.. ట్రంప్ మాత్రం మిత్రదేశం అంటూనే దెబ్బమీద దెబ్బ తీస్తున్నారు. భారత్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆపరేషన్ సిందూర్ అని ఓ విశ్లేషకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యాన్ని తిరస్కరించడంతో ఇందంతా…
Vice President Election: నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి వ్యూహంపై సమావేశంలో చర్చించారు. మీటింగ్ అనంతరం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం (ECI) ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీలను ప్రకటించిందని, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21 అని ఆయన తెలియజేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధానమంత్రి మోడీ, జేపీ నడ్డా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్…
Minister Komatireddy Venkat Reddy: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైర్హాజరైన విషయం తెలిసిందే..ఈ అంశంపై చీట్‌చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు వచ్చారని తెలిపారు.
KTR Slams Revanth Reddy: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలన వచ్చాక ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్తితి ఆగమాగం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అడిగితే తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాం.. అది దేవుని కండువా అంటున్నారన్నారు.. సీఎం ఎలా ఉండాలో నాయకత్వం ఎలా ఉండాలో చూపెట్టింది కేసీఆర్.. ఎలాంటి పనులు, ఎలాంటి భాష మాట్లాడొద్దు, ఎలా ఉండొద్దో చెప్పింది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఢిల్లీ వెళ్తే తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు..
Trump Tariffs: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ బాంబులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే.. నిన్న భారత్‌పై 50% శాతం అదనపు టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
9 Lies Donald Trump Told About India- Russa: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అనేక విమర్శలు గుప్పించారు. భారత్ రష్యాకు ఆర్థికంగా సహాయం చేస్తోందని అన్నారు. రష్యన్ చమురు కొనుగోలుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. నిన్న 50% టారిఫ్ విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. రష్యా నుంచి భారత్‌కు పెరుగుతున్న చమురు దిగుమతులు ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని ట్రంప్, పాశ్చాత్య మీడియా పేర్కొంటున్నాయి. కానీ వాస్తవం వేరేలా […]