Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- Yamaha R15 V4, MT-15 Version 2.0లో Monster Energy MotoGP Edition మళ్లీ విడుదల.
- రేసింగ్ లివరీకి మంచి ఆదరణ రావడంతో ప్రత్యేక ఎడిషన్‌ను తిరిగి తీసుకొచ్చిన యమహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamaha R15, MT-15 MotoGP: భారత మార్కెట్లో మరోసారి యమహా (Yamaha) మాన్స్టర్ ఎనర్జీ MotoGP ఎడిషన్ (Monster Energy MotoGP Edition)ను YZF-R15 V4, MT-15 Version 2.0 బైక్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. రేసింగ్ లివరీకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ రావడంతో కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్లను మళ్లీ విడుదల చేసింది. వీటితోపాటు FZ-S Fi Hybrid, FZ-S Fi మోడళ్లకు కూడా కొత్త కలర్ ఆప్షన్లను అందించింది.
ధరలు:
యమహా విడుదల చేసిన కొత్త మోడళ్ల ఎక్స్‌షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి.
* యమహా R15 V4 MotoGP ఎడిషన్ – రూ.1,76,050.
* యమహా MT-15 MotoGP ఎడిషన్ – రూ.1,77,230.
* యమహా FZ-S Fi హైబ్రిడ్ – రూ.1,39,200.
* యమహా FZ-S Fi – రూ.1,29,880.
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
MotoGP రేసింగ్ లివరీతో ప్రత్యేక ఎడిషన్:
R15 V4, MT-15 MotoGP ఎడిషన్ బైక్‌లలో గతంలో అందించిన అదే Monster Energy MotoGP రేసింగ్ లివరీని కొనసాగించారు. ఫ్యూయల్ ట్యాంక్, ట్యాంక్ ష్రౌడ్స్, సైడ్ ప్యానెల్స్‌పై MotoGP ప్రేరణతో రూపొందించిన ప్రత్యేక గ్రాఫిక్స్, రేసింగ్ డెకల్స్ ఈ బైక్‌లకు స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. స్టాండర్డ్ వేరియంట్ లతో పోలిస్తే ఈ ప్రత్యేక డిజైన్‌నే ప్రధాన తేడాగా కంపెనీ పేర్కొంది.
ఇంజిన్‌లో మార్పులు:
ఈ రెండు MotoGP ఎడిషన్ బైక్‌లలో 155cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్నే కొనసాగించారు. Variable Valve Actuation (VVA) టెక్నాలజీతో కూడిన ఈ ఇంజిన్ 18.4PS పవర్, 14.2Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. అయితే R15 V4, MT-15 మధ్య పవర్ డెలివరీలో స్వల్ప తేడా కోసం స్ప్రాకెట్ సెటప్‌ను భిన్నంగా ఉంచారు.

అధునాతన ఫీచర్లు:
ఈ రెండు బైక్‌లలో కూడా TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-చానల్ ABS, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా R15 V4లో ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు ఫీచర్లు MT-15 MotoGP ఎడిషన్ లో అందుబాటులో లేవు.
FZ-S సిరీస్:
యమహా FZ-S Fi హైబ్రిడ్ బైక్‌ను కొత్త ఐస్ స్టోర్మ్ కలర్లో విడుదల చేసింది. గ్రే, బ్లూ షేడ్స్‌తో కూడిన ఈ కొత్త పెయింట్ స్కీమ్‌కు కొత్త గ్రాఫిక్స్ జత చేశారు. ఇప్పటికే ఉన్న మాట్టే బ్లాక్ కలర్‌కు కూడా కొత్త డెకల్స్ అందించారు. అలాగే FZ-S Fi మోడల్‌కు కొత్త మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ను అందించారు. బ్లాక్ బాడీతో పాటు రెడ్ గ్రాఫిక్స్, రెడ్ కలర్ అల్లాయ్ వీల్స్ ఈ బైక్‌కు మరింత స్ట్రీట్-ఫ్రెండ్లీ లుక్‌ను అందిస్తున్నాయి. 2026 Yamaha FZ-S Fi ఇప్పుడు ఐస్ స్టార్మ్, మ్యాట్ బ్లాక్, సియాన్ మెటాలిక్ గ్రే, మెటాలిక్ బ్లాక్, ఐస్ ఫ్లూయో-వర్మిలియన్ అనే ఐదు రంగుల్లో లభించనుంది.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!