‘Vande Mataram’ 150th Anniversary Debate in Lok Sabha: "వందేమాతరం" 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చలో జాతీయ గేయం గురించి అనేక ముఖ్యమైన, పలు వాస్తవాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. పాటలోని కొన్ని శ్లోకాలను కాంగ్రెస్ తొలగించిందని ప్రధానమంత్రి ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా పార్లమెంట్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం లోక్‌సభ అజెండాలో జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై 10 గంటల…
MP Laxman: రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న తెలంగాణకు సమాధానం చెప్పు.. కుట్రలు, పన్నగాలకు తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు నిరసనగా ధర్నాచౌక్‌లో బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు.. అమలు చేయక పోవడమే, వంచించడమే మీ గ్యారంటీ హా? అని ప్రశ్నించారు. ప్రజల్ని తప్పు దోవ పట్టించేందుకు తెలంగాణ రైసింగ్ , గ్లోబల్…
Kishan Reddy: బీఆర్ఎస్ కుటుంబ పాలన మన మీద రుద్దింది.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంది అయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.. తెలంగాణ ప్రజలు తనకు బానిసలుగా ఉండాలని కేసీఆర్ భావించారని ఆరోపించారు. రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు నిరసనగా ధర్నాచౌక్‌లో బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. మార్పు కోసం అంటూ అభయ హస్తం అంటూ వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేశారు.. సోనియా, రాహుల్, ప్రియాంకలు అనేక…
Asaduddin Owaisi: ఇది ఏఐ యుగం. ఏఐ ద్వారా జనరేట్ చేసిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఏది అడిగినా చెప్పేస్తుంది. క్షణాల్లో అద్భుతాలు చేస్తుంది. మాయా ప్రపంచాన్నే సృష్టిస్తుంది. అదీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సత్తా. ఇదంతా ఓ ఎత్తైతే.. రెండో కోణమూ ఉంది. ఏఐ జనరేటెడ్ ఫొటో, వీడియో.. వాస్తవమా? అవాస్తవమా అంటే టెక్ నిపుణులే తటపటాయించే పరిస్థితి. డీప్‌ఫేక్‌ను మించి కల్లోలం రేపుతున్న ఈ సమస్యకు పరిష్కారం అసాధ్యంగా మారింది. READ […]
TTD to Build Venkateswara Temple in Patna: బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, భూమి కేటాయింపునకు పూర్తిస్థాయి ఆమోదం తెలపడంతో ఉత్తర భారతంలో టీటీడీ కార్యకలాపాలకు కొత్త దశ ప్రారంభమైంది. పాట్నా పరిధిలోని మోకామా ఖాస్ ప్రాంతంలో విశాల స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం కేటాయించగా, దీన్ని దీర్ఘకాలిక లీజు విధానంలో కేవలం నామమాత్రపు రుసుముతో టీటీడీకి అందజేయనున్నారు. 10.11 ఎకరాల భూమిని కేవలం ఒక్క రూపాయి…
Goa Blast: గోవా రాష్ట్రం అర్పోరా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్-కమ్-నైట్ క్లబ్ అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. సెకన్లలోనే, మంటలు వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది, కస్టమర్లు పారిపోవడానికి సైతం అవకాశం లభించలేదు. ఎగసిపడుతున్న మంటలు మొత్తం ప్రాంతాన్ని సర్వనాశనం చేశాయి. ఈ సంఘటనలో మరణాల సంఖ్య ఇరవై ఐదు మందికి చేరింది. వీరిలో 22 మంది ఊపిరాడక, ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ సంఘటనను చాలా విషాదకరంగా అభివర్ణించారు. క్లబ్‌ల భద్రతా ఆడిట్‌ను డిమాండ్ చేశారు.…
Harish Rao: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు. "రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.
Jagtial: వదిలేసిన తల్లిని రోడ్డుపై వదిలేసిన ఉదంతం జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నేను వస్తా RDO ఆఫీస్‌కి నువ్వు వేళ్ళు అంటూ చిన్న కొడుకు తల్లిని ఆటోలో ఎక్కించాడు. సాయంత్రమైనా ఇద్దరు కొడుకులు రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి నీళ్లు లేక చలిలో వణుకుతూ అక్కడే ఉండిపోయింది ఆ వృద్ధురాలు.. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకుల ఇలా వదిలేయం అందరినీ కంటతడి పెట్టించింది. చలికిలో వణుకుతు ఆ తల్లి ఆశ్రయం కోసం RDO కార్యాలయం ఎదుట వేచి ఉండిపోయింది. ఆర్డీవో…
AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా పిచ్చిలో పడొపోవద్దని హితవు పలికారు. ఏదైనా ఓ పరిమితి వరకే ఉండాలనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలతో ఎంతో మంది అభిమానులను కూడబెట్టుకన్న పవన్ ప్రేక్షకులకు ఇలాంటి గొప్ప సూచనలు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. నేనూ ఓ నటుడిగా చెబుతున్నాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ…
Tirupati National Sanskrit University: తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీ దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి.. ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రెగ్నెంట్ చేశాడు. గత కొన్ని నెలలుగా విద్యార్థినితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి రికార్డు చేశాడు... సెల్ ఫోన్ లో రికార్డు చేసి విద్యార్థిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు.