Cyclone Alert: తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా ప్రామాణిక నిర్వహణ విధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్) రూపొందించింది. తుపాన్ రాకముందు వైద్య సేవలు అందించేందుకు ఆసునతులవారీగా సంసిద్ధత ఎలా ఉండాలి? వచ్చినప్పుడు వైద్యులు ఎలా స్పందించాలి? అనంతరం వ్యాధులు ప్రజలకుండా, పునరావాస, ఇతర చర్యలు జిల్లా స్దాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలన్న దాని గురించి 7 పేజీల్లో వైద్య శాఖ వివరించింది. రాష్ట్రానికి మొంథా’ […]
Bus Fire Accident: కర్నూలు సమీపంలో జరిగిన దారుణ బస్సు ఘటన జరగక ముందే.. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సులో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బస్సు ఢిల్లీ నుంచి […]
Minister Vangalapudi Anitha: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు సహాయక చర్యలపై రాష్ట్ర హోంమంత్రి అనిత ఎన్టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా తుపాను ముప్పుపై అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. తుపాను ఈ నెల 28న అర్ధరాత్రి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని హోంమంత్రి వెల్లడించారు. దీని ప్రభావంతో రేపటి (27వ తేదీ) నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, […]
Jharkhand: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా, చాయిబాసాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చాయిబాసాలోని సదర్ ఆసుపత్రిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్లు తేలింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించడంతో రాంచీ నుంచి ఆరోగ్య శాఖ బృందం విచారణ కోసం చాయిబాసా చేరుకుంది. రాంచీ నుంచి వచ్చిన వైద్యుల బృందం తొలుత సదర్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూన(PICU)ని తనిఖీ చేసింది. […]
VC Sajjanar: హైదరాబాద్ మహానగరంలోని చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో జరిగిన కాల్పుల ఘటన స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీతో పాటు క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. ఇక ఈ ఘటనపై సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటన ఈరోజు సాయంత్రం 5 గంటలకు చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద జరిగిందని ఆయన తెలిపారు. […]
Kavitha: నిజామాబాద్ జిల్లా యంచలో జరిగిన కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి నది ముంపు ప్రాంతాల్లో పంట నష్టం జరగడానికి మంత్రులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. కవిత మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులు, అధికారుల పాపం, నిర్లక్ష్యం వల్లే పంట నీట మునిగింది. ముంపు బాధిత రైతులకు ఎకరానికి రూ.50 వేలు పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. పంట నష్టంపై జిల్లా […]
Motorola G96 vs Motorola Edge 60 Fusion: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మొటొరోలా (Motorola) వైవిధ్యమైన, ఆకర్షణీయమైన మోడళ్లతో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మంచి పనితీరు, నాణ్యమైన కెమెరా, ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తూ వస్తోంది. ఇకపోతే మిడ్ రేంజ్ ధరల్లో లభిస్తున్న Motorola G96 5G, Motorola Edge 60 Fusion 5G స్మార్ట్ఫోన్లు మంచి స్పెసిఫికేషన్లతో పోటీపడుతున్నాయి. మరి ఈ రెండు ఫోన్ల కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ మరియు ధరల పరంగా […]
Liquor Shop Draw: తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి హైకోర్టు కీలక అనుమతి ఇచ్చింది. దీంతో మద్యం షాపుల డ్రా నిర్వహణకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 27న (సోమవారం) డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు నుంచి అనుమతి లభించడంతో, డ్రా ఏర్పాట్లను పూర్తి చేయాల్సిందిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ అధికారులకు […]
Cardamon Benefits: యాలకులు ‘జింగీబెరాసెయ్’ జాతికి చెందినవి. ఇవి భారతదేశంతో పాటు భూటాన్, నేపాల్, ఇండొనేషియా వంటి దేశాల్లో వీటిని అధికంగానే పండిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలలో ‘రాణి’గా పిలిచే యాలకులు.. కాస్త ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఈ యాలకులు ప్రధానంగా ఆకుపచ్చ, నలుపు అనే రెండు రకాలు ఉన్నాయి. మనం ఎక్కువగా ఉపయోగించే ఆకుపచ్చ యాలకులు భారత్, మలేసియాలో అధికంగా పండిస్తారు. ఇక దీని ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే.. Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక […]
Hyderabad: హైదరాబాద్ మహానగరంలో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ ప్రాంతంలో సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడికి యత్నించగా.. డీసీపీ స్వయంగా కాల్పులు జరిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకోవడానికి డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ దొంగ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ తోపులాటలో డీసీపీ గన్‌మ్యాన్ కిందపడటంతో, […]