VC Sajjanar: హైదరాబాద్ మహానగరంలోని చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో జరిగిన కాల్పుల ఘటన స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీతో పాటు క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. ఇక ఈ ఘటనపై సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటన ఈరోజు సాయంత్రం 5 గంటలకు చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద జరిగిందని ఆయన తెలిపారు. రౌడీ షీటర్లు, మొబైల్ స్నాచర్‌లు ఇద్దరు స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారని వివరించారు.
Viral Video: జస్ట్ మిస్.. బెంగళూర్ హైవేపై తప్పిన ప్రమాదం.. నెట్టింట వీడియో వైరల్..
దాడి చేసిన రౌడీ షీటర్ పేరు మహమ్మద్ ఉమర్ అన్సారీ అని సీపీ వెల్లడించారు. అన్సారీపై ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదయ్యాయని, అందులో రెండు పీడీ యాక్ట్‌లు ఉన్నాయని.. అతను రెండేళ్లు జైల్లో ఉన్నాడని తెలిపారు. దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్‌మన్‌తో వెళ్లగా.. దొంగ కత్తితో గన్‌మన్‌పై దాడి చేశాడని వివరించారు. ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ చైతన్య వెంటనే స్పందించి దొంగపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారని సజ్జనార్ స్పష్టం చేశారు. కాల్పుల కారణంగా దొంగ మహమ్మద్ ఉమర్ అన్సారీకి చేతిపై, కడుపులో గాయాలయ్యాయని, వెంటనే అతడిని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించామని సీపీ తెలిపారు. ఈ ఘటనలో స్వల్ప అస్వస్థతకు గురైన డీసీపీ, అలాగే గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు క్షేమంగా ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని, పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నామని, అలాగే మహమ్మద్ ఉమర్ అన్సారీకి సహకరిస్తున్న వారిని కూడా గుర్తిస్తామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
Air India : ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి., క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం