Hyderabad: హైదరాబాద్ మహానగరంలో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ ప్రాంతంలో సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడికి యత్నించగా.. డీసీపీ స్వయంగా కాల్పులు జరిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకోవడానికి డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ దొంగ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ తోపులాటలో డీసీపీ గన్‌మ్యాన్ కిందపడటంతో, […]
Kavitha: మాజీ ఎమ్మెల్సీ కవిత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై చేసిన ఆరోపణల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 2న కవిత చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరుతూ ఆయన ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు అనంతరం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినట్లు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె […]
KTR: తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడం తప్పా ఇంకేమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒకవేళ జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే.. […]
Realme P3 Lite 5G vs POCO M7 Pro 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 5G ఫోన్ల ధరలు ఈ మధ్య కాలంలో కాస్త తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ సేల్స్‌లో ప్రముఖ బ్రాండ్లైన POCO, Realme తమ లేటెస్ట్ 5G మోడళ్లను సరసమైన తగ్గింపు ధరలతో అందిస్తున్నాయి. కేవలం 12,000 లోపు ధరలో లభిస్తున్న POCO M7 Pro 5G, Realme P3 Lite 5G స్మార్ట్ఫోన్లలో ఏది మెరుగైనది? కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్ […]
Rain in Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా, అంతలోనే ఆకాశం మేఘావృతం కావడంతో ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బోరబండ, రెహమాత్ నగర్, యూసఫ్ గూడా, ఎర్రగడ్డ ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే, కోఠి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షపాతం నమోదైంది. Hyderabad ORR Tragedy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. […]
Traul: వస్తువుల రవాణాను మరింత సులభంగా, వేగంగా, తక్కువ ధరకే సేవలను అందించేలానే లక్ష్యంతో స్థానిక లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పుకు ట్రాల్ (Traul) సిద్ధమైంది. ఓలా, ర్యాపీడో వంటికి చెక్ పెడుతూ.. సొంత సాంకేతికత ఆధారిత ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులను నేరుగా నమ్మకమైన డ్రైవర్లు, వాహనాలతో అనుసంధానిస్తూ.. ట్రాల్ వేగవంతమైన, నమ్మదగిన డెలివరీ సేవలను విజయవాడ నగరంలో అందిస్తోంది. ఇక ట్రాల్ సంస్థ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విభిన్న సేవలను అందిస్తోంది. చిన్న పార్శిల్స్ […]
Off The Record: ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తొందరపడ్డారా? డేటా సెంటర్స్ గురించి అధినేత మనసులో ఏముందో తెలుసుకోకుండా ముందే స్పందించారా? గూగుల్ విషయమై తాజాగా జగన్ రియాక్షన్‌కు, అంతకు ముందు వాళ్ళ స్పందనలకు మధ్య వ్యత్యాసాన్ని ఎలా చూడాలి? అది సమన్వయ లోపమా? లేక అధ్యక్షుడి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేద్దామనుకున్న నాయకుల అత్యుత్సాహమా? లెట్స్ వాచ్. ఊరికి ముందే ఉత్తరాంధ్ర వైసీపీ నాయకత్వం గూగుల్ డేటా సెంటర్‌కు వ్యతిరేక స్వరం వినిపించింది. అదో గోడౌన్ […]
OnePlus Ace6: వన్ ప్లస్ (OnePlus) సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace6 ను అక్టోబర్ 27న చైనాలో OnePlus 15 తో పాటు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈ మొబైల్ కీలక వివరాలు చైనా టెలికాం వెబ్సైట్లో ముందుగానే లీక్ అయ్యాయి. OPPO PLQ110 మోడల్ నంబర్‌తో ఈ మొబైల్ ఈ లిస్టింగ్ ఫోన్ సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్లను మొదటిసారిగా బయటకు వచ్చాయి. OnePlus ఇప్పటికే క్విక్ సిల్వర్ (Quicksilver), […]
Off The Record: ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత.. ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ… ఇక్కడెవరన్నా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్‌గా సీన్లోకి వచ్చేస్తున్నారట. ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పే…ద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా? మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్ […]
Off The Record: ఎక్కడన్నా… ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉండటం, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదని విమర్శించడం సహజం. కానీ… అక్కడ మాత్రం ఓడిపోయిన, ప్రతిపక్ష నేతను అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావని నిలదీసే పరిస్థితులు ఉన్నాయి. అందునా, వాళ్ళు వీళ్లు కాకుండా… సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే నిలదీస్తున్న వాతావరణం. ఏ నియోజకవర్గంలో ఉందా స్థితి? ఏ మాజీ ఎమ్మెల్యేని నువ్వు మాకొద్దు మహాప్రభో అని కేడర్ దండం పెడుతోంది? 7800mAh బ్యాటరీ, […]