Cyclone Alert: తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా ప్రామాణిక నిర్వహణ విధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్) రూపొందించింది. తుపాన్ రాకముందు వైద్య సేవలు అందించేందుకు ఆసునతులవారీగా సంసిద్ధత ఎలా ఉండాలి? వచ్చినప్పుడు వైద్యులు ఎలా స్పందించాలి? అనంతరం వ్యాధులు ప్రజలకుండా, పునరావాస, ఇతర చర్యలు జిల్లా స్దాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలన్న దాని గురించి 7 పేజీల్లో వైద్య శాఖ వివరించింది. రాష్ట్రానికి మొంథా’ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్వ ఉత్తర్వులను సమీక్షించి, డిజాస్టర్ మేనేజ్మెంటు (వివత్తు నిర్వహణ), వాతావరణ కేంద్రం అధికారులతో సంప్రదించి రూపొందించిన ప్రామాణిక నిర్వహణ విదానాల్లో.. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా, భోదనాసుపత్రుల వరకు సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. మంత్రి ఆమోదం మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ వీటిని జిల్లాలకు వైద్య ఆరోగ్య శాఖ పంపింది.
OnePlus 15: వన్‌ప్లస్ 15 రేపే లాంచ్.. పవర్ ఫుల్ ప్రాసెసర్, 7,300mAh బ్యాటరీ..
సిద్ధంగా పీహెచ్సీల్లో యాంటీ స్నేక్ వీనమ్, ర్యాబిస్ వ్యాక్సిన్లు:
ఆసుపత్రుల్లో అవసరాలకు సరిపడా యాంటీ బయాటిక్ మందులు, యాంటి స్నేక్ వీనమ్, 100 యాంటీ ర్యాబిస్ డోన్ లు నిల్వ ఉంచుకోవాలని తెలిపింది. ముఖ్యoగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ స్నేక్ వీనమ్ 30 వయల్స్ కనీసం 500 మందికి సరిపడా యాంటీ బయాటిక్ మందులు, ఓఆర్ఎస్ ఫ్లూయడ్స్ 500 ప్యాకెట్లు/200 బాటిల్స్ చొప్పున ఉండాలని స్పష్టంచేసింది. అనుపత్రుల సామర్థ్యానికి తగ్గట్లు అనుసరించాల్సిన విధానాల గురించి కొత్త ఎస్ఓపీలో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే.. బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా, నీరు కలుషితం కాకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఆయా శాఖలతో సమన్వయం ఎలా ఉండాలన్న దానిపై కూడా ప్రామాణిక విధివిధానాలు తెలిపారు.
రాష్ట్ర నోడల్ ఆఫీసర్ గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్:
ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై పర్యవేక్షణ, సమన్వయ అధికారిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి వ్యవహరిస్తారు. రాష్ట్ర సర్వైలెన్స్ ఆఫీసర్ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎపిడమిక్ సెల్ 24 గంటలపాటు పనిచేయాలి. తుపాన్ సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, ఇతర శాఖల అధికారులతో రాష్ట్ర సెల్ లో ఉన్న సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి తెలుసుకుంటూ సదరు శాఖలతో సమన్వయంచేస్తూ బాధితులకు వైద్యసేవలను చేరువ వేయాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తో ‘డిస్ట్రిక్ట్ ఎపిడమిక్ కంట్రోల్ రూం అనుసంధానం జరగనుంది. భారతీయ వాతావరణ శాఖ నుంచి వచ్చే తుపాన్ హెచ్చరికలకు అనుగుణంగా ఎపిడమిక్ కేంద్రాల్లో ఉండే వారు తమ పరిధిలోని వారితో సంప్రదిస్తూ అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. హైకమాండ్ రాడార్‌లో అందరూ..
వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో:
అసుపత్రుల్లో వైద్యులు, ఇతర పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఆయా ప్రాంతాల్లోని గర్భిణులు, వృద్దులు, అంగవైకల్యం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలిగిన వారి వివరాలు సిద్ధం చేసుకోవాలి. తుపాన్ కు, ప్రసవ అంచనా తేదీకి మధ్య 15రోజుల వ్యవధి కలిగిన గర్భిణుల వివరాలు సిద్ధంచేసుకోవాలి. తుపాన్ హెచ్చరికలకు అనుగుణంగా కనీసం 2 రోజుల ముందు దగ్గర్లోని ఆసుపత్రులకు వీరిని తరలించేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలి. ప్రతి 50వేల జనాభాకు ఒక ఐడీఎస్పీ (సర్వైలెన్స్) అధికారిని అందుబాబులో ఉంచాలి. అలాగే అనుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు, పారా మెడికల్, అంబులెన్సుల సిబ్బందిని సమన్వయం చేసుకునేలా వాట్సన్ గ్రూపులు ఏర్పాట్లు చేసుకోవాలి. సీహెచ్ఓలు, ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం.లు ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. మంచినీరు, పారిశుధ్యం, ప్రాథమిక చికిత్సల గురించి వివరించాలి. ‘సైక్లోన్ షెల్టర్లలో ఏర్పాటుచేసే వైద్య శిబిరాల్లో ఒక వైద్యుడు, సీనియర్ నర్సు, కనీసం ఇద్దరు సారా మెడికల్ సిబ్బంది ఉండాలి. అలాగే 108, 104, 102 అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంధన సమస్య తలెత్తకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. తుపాన్ బాధిత ప్రాంతాల్లోని వారిని అవసరాలకు తగ్గట్లు సమీపంలోని సీహెచ్సీ వంటి ఆసుపత్రులకు తరలించేందుకు వీటిని రెడీ చేయాలి.
వైద్య సేవలు వెంటనే అందించేలా సిద్ధంగా:
తుపాన్ సమయంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలి. బాధిత ప్రాంతాలను గుర్తించి రోగులకు వైద్య సేవలు అందించాలి. సైక్లోన్ షెల్టర్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలి. ప్రతి 6 గంటలకు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చిన వివరాలకు అనుగుణంగా వైద్య సేవలు కొనసాగాలి. వరదలు సంభవించే ప్రాంతాల్లో బోటు క్లినిక్కులను సైతం సిద్ధంచేయాలి. మత్స్య శాఖ వారితో సంప్రదించి ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేసుకోవాలి. తుఫాన్ కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశాలున్నందున క్లోరిన్ మాత్రలు, జీచింగ్ పౌడరును స్థానికులకు అందించాలి. పంచాయతీ, గ్రామీణ నీటి పారుదల శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియ జరగాలి.. విద్యుత్తు సరఫరాకు అవరోధం ఏర్పడితే వెంటనే ఆసుపత్రుల్లో జనరేటర్ వినియోగించేలా ముందస్తు చర్యలు ఉండాలి. కనీసం 3 రోజుల పాటు జనరేటర్ వినియోగానికి తగ్గట్లు ఇంధనం నిల్వలో ఉండాలి. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ప్రతి స్పందన)లు సిద్ధంగా ఉండాలి. జిల్లా కేంద్రం మంచి వచ్చే అదేశాలకు అనుగుణంగా అవసరమైన ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ టీంలు వెళ్లాలి. డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తిచెందకుండా తగిన చర్యలు తీసుకోవాలి.