Cardamon Benefits: రోజుకు రెండంటే.. రెండు చాలు.. ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cardamon Benefits: యాలకులు ‘జింగీబెరాసెయ్’ జాతికి చెందినవి. ఇవి భారతదేశంతో పాటు భూటాన్, నేపాల్, ఇండొనేషియా వంటి దేశాల్లో వీటిని అధికంగానే పండిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలలో ‘రాణి’గా పిలిచే యాలకులు.. కాస్త ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఈ యాలకులు ప్రధానంగా ఆకుపచ్చ, నలుపు అనే రెండు రకాలు ఉన్నాయి. మనం ఎక్కువగా ఉపయోగించే ఆకుపచ్చ యాలకులు భారత్, మలేసియాలో అధికంగా పండిస్తారు. ఇక దీని ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే..
Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక ప్రకటన.. వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ!
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
యాలకుల రుచి, సువాసన మనలో ఉండే టెన్షన్, ఉద్రేకత, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒత్తిడిలో ఉన్నవారు యాలకుల పొడిని టీ లేదా పాలలో వేసుకుని తాగడం ఉత్తమం. యాలకుల గింజలను నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది. డిప్రెషన్ నుండి బయటపడాలంటే కూడా యాలకుల టీ లేదా పాలు తాగడం ఉపశమనాన్ని ఇస్తుంది. బాధలను తట్టుకోలేక నెగెటివ్ ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవారికి యాలకులు మంచి ఉపకారిగా పనిచేస్తాయి.
సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ‘సినియోల్’ (Cineole) అనే సమ్మేళనం పురుషులలో నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది. నరాల బలహీనత, లైంగిక సామర్ధ్యం తక్కువగా ఉన్నవారు రోజూ యాలకులను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ చిటికెడు యాలకుల పొడి వాడినట్లయితే సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో మెటబాలిజాన్ని పెంచే గుణాలు ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలను పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి.
WhatsApp Tips: ఇలా చేస్తే వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవచ్చు!
అలాగే కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం లాంటి సమస్యలతో బాధపడేవారు యాలకులను క్రమం తప్పకుండా వాడాలి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఊపిరితిత్తులకు మేలు చేయడంతో కఫాన్ని తగ్గిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల నివారణకు కూడా ఆకుపచ్చ యాలకులను వాడతారు. యాలకుల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఫైబర్ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండెకు రక్త సరఫరా చక్కగా జరిగేలా చూస్తాయి. యాలకులలోని మాంగనీస్ డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది. అలాగే, యాలకులు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, యాలకుల్లోని సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్‌ను అడ్డుకోవడం, దాని పెరుగుదలను నెమ్మదింపజేయడం, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని జంతువులపై జరిపిన పరిశోధనల్లో తేలింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!