Kavitha: నేను బీఆర్‌ఎస్‌లో లేను.. రైతుల పక్షాన ఉంటాను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha: నిజామాబాద్ జిల్లా యంచలో జరిగిన కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి నది ముంపు ప్రాంతాల్లో పంట నష్టం జరగడానికి మంత్రులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. కవిత మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులు, అధికారుల పాపం, నిర్లక్ష్యం వల్లే పంట నీట మునిగింది. ముంపు బాధిత రైతులకు ఎకరానికి రూ.50 వేలు పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్ మరోసారి సర్వే చేయించాలని ఆమె కోరారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేసి ఉంటే ముంపు ఈ స్థాయిలో ఉండేది కాదని కవిత అభిప్రాయపడ్డారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ.. సగం పంట అమ్ముకున్నాకే ప్రభుత్వం ధాన్యం కొంటుందని విమర్శించారు. వరి పంటకు మద్దతు ధర, బోనస్ రావడం లేదని, అలాగే మొక్కజొన్న, పసుపు పంటకు కూడా మద్దతు ధర ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
ఇటీవల బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంపై స్పందించిన కవిత, ఆయనకు చురకలు అంటించారు. ఇటీవల షకీల్ హైదరాబాద్‌కి వెళ్లినట్లు ఉన్నారు.. వచ్చిపోవడం కాదు.. వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయాలని కవిత హితవు పలికారు. అలాగే ఆమె తెలంగాణ సంస్కృతి, రైతుల హక్కుల గురించి మాట్లాడుతూ.. తెలంగాణ చేతిలో నుంచి బతుకమ్మను తొలగించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బోనస్, బతుకమ్మ చీరలు, తులం బంగారం రావాలంటే పిడికిలి ఎత్తి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే కవిత మాట్లాడుతూ.. “నేను బీఆర్‌ఎస్ పార్టీలో లేను కానీ, రైతుల పక్షాన ఉంటాను. బీఆర్‌ఎస్‌లో ఉన్నా, లేకున్నా, రైతుల పక్షానే ఉంటా” అని స్పష్టం చేశారు. ముంపు బాధిత రైతుల కోసం భారీ స్థాయిలో పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు.
Cardamon Benefits: రోజుకు రెండంటే.. రెండు చాలు.. ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోను..!
తాజావార్తలు
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!